హైదరాబాద్‌లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2023–-24 విద్యా సంవత్సరానికి డిస్టెన్స్ విధానంలో యూజీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ ఆహ్వానిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని 22 అధ్యయన కేంద్రాల్లో అభ్యర్థులు ప్రవేశాలు పొందవచ్చు.
యూజీ కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్సీ పీజీ ప్రోగ్రామ్స్: ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, ఎబీఏ, ఎంఎల్ ఐఎస్సీ, బీఎల్ఐఎస్సీ, డిప్లొమా ప్రోగ్రామ్స్‌తో పాటు సర్టిఫికెట్ ప్రోగ్రామ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హత: కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్లో జులై 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు www.braouonline.in వెబ్సైట్లో సంప్రదించాలి.