- అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి
రామచంద్రాపురం (అమీన్పూర్) , వెలుగు: ప్రైవేట్ స్కూల్స్‌కి దీటుగా ప్రభుత్వ స్కూల్స్టూడెంట్స్ ఫలితాలు సాధించాలని అమీన్పూర్మున్సిపల్ చైర్మన్ పాండురంగా రెడ్డి అన్నారు. వీ ఫర్ యూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న టెన్త్ స్టూడెంట్స్‌కు ఎగ్జామ్ కిట్స్అందజేశారు. ఈ సందర్భంగా పాండురంగా రెడ్డి మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వం విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణల వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోందన్నారు. ఉచిత భోజనం, యూనిఫాంలు, ఫ్రీ బుక్స్‌ను స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణ, కల్పన, చంద్రకళ, కో ఆప్షన్ మెంబర్ రాములు, నాయకులు చంద్రశేఖర్, యాదగిరి, ఫౌండేషన్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, సభ్యులు మల్లికార్జున్, ప్రవీణ్ పాల్గొన్నారు.