తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దృష్టి సారించింది. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చుతోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాల్టీ పరిధిలోని వందనపురి కాలనీలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించి ఒ వ్యక్తి ఇంటిని నిర్మించాడని హైడ్రా అధికారులు గుర్తించారు. ఆర్ఎస్నెం: 848 లో అక్రమంగా ఇంటి నిర్మాణం చేపట్టడంతో స్థానికులు హైడ్రా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీ ప్రజలు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు పట్టించుకోలేదని హైడ్రా అధికారులకు తెలిపారు.
ALSO READ : హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు..షాద్నగర్, చేవెళ్ల,బంజారాహిల్స్లో రైడ్స్
ఫిర్యాదు పై స్పందించిన హైడ్రా .. రంగంలోకి దిగి రోడ్డు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపట్టిన ఇంటిని జేసీబీలతో కూల్చారు. ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు. . రోడ్డును ఆక్రమించి నిర్మించిన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయటంతో కాలనీ సొసైటీ సభ్యుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.