బాలీవుడ్ నటి అమీషా పటేల్(Ameesha patel) అవకాశాలను ఎవరు లాగేసుకున్నారు..? ఎందుకలా చేశారనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన విజయాన్ని చూసి కొందరు ఓర్వలేకపో యారని...తన ఎదుగుదలని జీర్ణించుకోలేక కొందరు వెన్నుపోటు దారులుగా మారారని, మరికొందరు ఇదే అదనుగా తన అవకాశాల్నే లాగేసుకున్నారని ఆరోపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీషా ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
అమీషా పటేల్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్(Hrithik roshan) సరసన `కహోనా ప్యార్ హై(Kahona pyar hai)` సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా బంపర్ హిట్ కావడంతో అమీషా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కొన్నాళ్ల పాటు నటిగా తిరిగి లేని జర్నీ సాగించింది. అటుపై `బద్రీ(Badri)` సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇక్కడ ఎక్కువగా సినిమాలు చేయలేదు. బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టి పనిచేసింది.
ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ...‘నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలుపెట్టిన సమయంలో నాతో పాటూ యాక్టర్లు.. నిర్మాతలు పిల్లలు అరంగేట్రం చేశారు. కరీనా కపూర్(Kareena kapoor).. అభిషేక్ బచ్చన్(Abhishek bachhan).. హృతిక్ రోషన్.. తుషార్ కపూర్(Thushara kapoor).. ఈషా డియోల్(Eesha deol).. ఫర్దీన్ ఖాన్(Fardeen khan).. ఇలా చాలా మంది వారసులు వచ్చారు. ఎటు తలతిప్పినా సినీకుటుంబాలకు చెందిన మూడో తరం వారు కనిపించేవారు. వాళ్ల మధ్యలో నేను ఒక్కదాన్నే ఎలాంటి సహకారం లేకుండా పరిశ్రమకి వచ్చినదాన్ని. నాకు వచ్చిన అవకాశాలతో సంతృప్తిగా సినిమాలు చేసేదాన్ని. అలా నటిగా ఎదిగాను. సెట్లో నా పని చూసుకోవడం తప్ప ఇతర విషయాలు పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. టైం దొరికితే పుస్తకాలు చదువుకునేదాన్ని. ఎవరిపైనా రూమర్స్ గురించి మాట్లాడేదాన్ని కాదు. సెట్లో చీటికీమాటికీ అలకలుబూనే దాన్ని అసలే కాదు. ఇలా ఉండటం కూడా అక్కడ భావ్యం కాదు. నేను అతి చేస్తున్నానని కొందరు అనుకునేవారు. నా చుట్టూ ఉన్న సహచరులు అలా భావించి వదల్లేదు వారు నా సక్సెస్ చూసి ఓర్వలేకపోయారు. కొందరు నా నుంచి సినిమాలను కూడా లాగేసుకున్నారు` అంటూ ఆవేదన వ్యక్తం చేసింది