అతనితో రిలేషన్.. కెరీర్ నాశనం : అమీషా పటేల్

అతనితో రిలేషన్.. కెరీర్ నాశనం : అమీషా పటేల్

బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్‌(Ameesha patel) డైరెక్టర్ విక్రమ్ భట్(Vikram bhat) పై షాకింగ్ కామెంట్స్ చేశారు. అతనితో రిలేషన్ లో ఉండటం వల్ల తన కెరీర్ నాశనం అయ్యిందని తెలిపంది. అమీషా పటేల్‌ చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

ప్రస్తతం అమీషా పటేల్‌ గదర్‌ 2(Gadar2) సినిమాలో నటిస్తోంది. 1971లో జరిగిన ఇండో-పాక్‌ యుద్ధ నేపథ్యంలో రానున్న ఈ మూవీ.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓ  ఇంటర్వ్యూలో పాల్గొంది అమీషా. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. " సినీ పరిశ్రమలో నిజాయితీకి విలువ ఉండదు. నేను నా జీవితంలో మొదటినుండి నిజాయితీగా ఉన్నాను. కానీ నేను నమ్మినవారు మాత్రం అలా లేరు. వాళ్ళని నమ్మడమే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు. అలా నేను ఎంతగానో నమ్మిన వ్యక్తే.. పబ్లిక్‌గా మరో వ్యక్తితో కలిసి ఉండటం చూసి నేను తట్టుకోలేకపోయాను. ఇక అప్పటినుండి నా జీవితంలో మరో వ్యక్తికి చోటు ఇవ్వలేదని" తెలిపింది అమీషా.