నిజామాబాద్, వెలుగు : లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్సూచించారు. ఎలాంటి లోపాలు లేకుండా ఓటర్ లిస్టు రూపొందేలా చర్యలు చేపట్టాలన్నారు. బుధవారం ఆయన కలెక్టర్, రిటర్నింగ్ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అసెంబ్లీ సెగ్మెంట్ యూనిట్‌గా ఎన్నికల ఏర్పాట్లు చేయాలన్నారు. స్ర్టాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఎంపిక పూర్తి చేయాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తలెత్తిన లా అండ్ఆర్డర్ ఇష్యూలు లోక్‌సభ ఎలక్షన్స్‌లో రిపీట్‌కాకుండా చూడాలన్నారు.
ఓటర్ లిస్టు మార్పుచేర్పుల దరఖాస్తులు వెంటవెంటనే పరిష్కరించాలన్నారు. కలెక్టర్రాజీవ్గాంధీ హన్మంతు మాట్లాడుతూ.. జనవరి 6న ముసాయిదా ఓటర్ లిస్ట్ రిలీజ్చేస్తామని తెలిపారు. అభ్యంతరాలు స్వీకరించి ఫిబ్రవరి 8న ఫైనల్‌లిస్ట్ ప్రకటిస్తామన్నారు. అడిషనల్కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, ఆర్డీవోలు రాజాగౌడ్, రాజేంద్రకుమార్, వినోద్‌కుమార్, భుజంగ్‌రావు పాల్గొన్నారు.