సీఏఏపై ఆందోళన చెందుతున్నం: అమెరికా కామెంట్​

న్యూఢిల్లీ: మన దేశంలో అమలు చేస్తున్న సిటిజన్ షిప్ అమెండమెంట్ యాక్ట్ (సీఏఏ)పై అమెరికా కామెంట్లు చేసింది. సీఏఏపై తాము ఆందోళన చెందుతున్నామని, దాని అమలును నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొంది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 11న సీఏఏపై ఇచ్చిన నోటిఫికేషన్ పై మేం ఆందోళన చెందుతున్నాం. దాన్ని ఎలా అమలు చేయనున్నారనేది నిశితంగా పరిశీలిస్తున్నాం. 

మత స్వేచ్ఛను గౌరవించడం, అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడడం ప్రజాస్వామ్య మూలసూత్రం” అని అన్నారు.  కాగా, 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్ కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సీఏఏను తీసుకొచ్చింది. దీన్ని అమల్లోకి తెస్తూ ఈ నెల 11న నోటిఫికేషన్ జారీ చేసింది.