వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ పోల్ సర్వేల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజీ సంయుక్తంగా స్వింగ్ స్టేట్ పోల్స్ సర్వేను తాజాగా నిర్వహించాయి. ఈ సర్వేలో డోనాల్డ్ ట్రంప్ కన్నా కమలా నాలుగు పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తేలింది. ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ మధ్య ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం మూడు రాష్ట్రాల్లో డోనాల్డ్ ట్రంప్ కు 46 శాతం మంది మద్దతు పలికారు. కమలా హారీస్ కు 50 శాతం మంది సపోర్ట్ చేస్తున్నట్టు వెల్లడైంది.