ముంబై పేలుళ్ల నిందితుడు తహవుర్ రాణాను అప్పగించేందుకు ఓకే చెప్పిన అమెరికా

ముంబై పేలుళ్ల నిందితుడు తహవుర్ రాణాను అప్పగించేందుకు ఓకే చెప్పిన అమెరికా

ముంబై పేలుళ్ల నిందితుడు తహవుర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. తహవుర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు శనివారం(జనవరి 25) అమెరికా సుప్రీం కోర్టు అంగీకరించింది.

భారత్ కు అప్పగించడాన్ని అడ్డుకోవాలని రాణా 2024 నవంబర్ లో రిట్ పిటీషన్ వేశాడు. యూఎస్ తదుపరి అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తర్వాత 2025 జనవరి 24న సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రాణా పిటీషన్ ను కొట్టేయాలని, భారత్ కు అప్పగించాలన్న భారత్ అభ్యర్థనను గత ఏడాది అమెరికా ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు రాణాను భారత్ కు అప్పగించడం సబబేనని చెప్పడం గమనార్హం. 

పాకిస్తాన్ మూలాలున్న తహవుర్ రాణా.. భారత్ అభ్యర్థనను తిరస్కరించాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశాడు. రాణా పిటీషన్ కు వ్యతిరేకంగా 2024 డిసెంబర్ 24న యూఎస్ సొలిసిటర్ జనరల్ ఎలిజబెత్ బి ప్రెలోగర్ సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. 

2008లో 10 మంది పాకిస్తాన్ టెర్రిస్టులు జరిపిన ముంబై దాడిలో 166 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 6గురు అమెరికా పౌరులు కూడా మృతి చెందారు. ముంబై 26/11 పేలుళ్ల సూత్రదారి డేవిడ్ కోల్ మన్ హెడ్లీ తో రాణాకు సంబంధాలున్నాయి.  హెడ్లీతో కలసి ముంబై దాడికి ప్లాన్ చేసినట్లు ఆధారాలున్నాయి.