ఏక్షణమైనా ఇరాన్ దాడి.. ఇజ్రాయెల్‌‌కు అమెరికా వార్నింగ్

ఏక్షణమైనా ఇరాన్ దాడి.. ఇజ్రాయెల్‌‌కు అమెరికా వార్నింగ్

న్యూఢిల్లీ: ఇరాన్ లేదా దాని మద్దతు సంస్థ లు ఇజ్రాయెల్‌‌పై ఏ క్షణమైనా అటాక్ చేసే ప్రమాదం ఉందని అమెరికా హెచ్చరించింది. ఈ వారంలో దాడి జరిగే అవకాశాలు  ఎక్కువని ఇంటెలిజెన్స్ శాఖ నివేదికలో పేర్కొందని  వైట్ హౌస్  ప్రతినిధి జాన్ ఎఫ్ కిర్బీ తెలిపారు. హమాస్ చీఫ్ హనియా, హిజ్బుల్లా కమాండర్ ఫువాద్​ను ఇజ్రాయెల్ చంపేసింది. 

ఈ హత్యలకు ఇజ్రాయెల్​పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇజ్రాయెల్​పై ఇరాన్ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే అంచనాలతో మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నేతలు కలసి ఇజ్రాయెల్​పై దాడి చేయవద్దని.. ఓర్పు వహించాలని ఇరాన్​ను కోరారు.