న్యూజెర్సీలో భారత సంతతి దంపతుల హత్య

న్యూజెర్సీలో భారత సంతతి దంపతుల హత్య
  • పిల్లల్నీ వదలని దుండగులు

న్యూయార్క్: అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన భార్యాభర్తలు పిల్లలతో సహా వారి ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. హతేజ్ ​ప్రతాప్ ​సింగ్, సోనాల్ ​పరీహర్ భార్యాభర్తలు. ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరికి ఇద్దరు పిల్లలు. ప్లెయిన్స్​బోరోలో ఉంటున్న ఈ కుటుంబం అక్టోబర్​4న ఎంతకూ ఇంటి తలుపులు తెరవకపోవడంతో వారి బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి డోర్లు ఓపెన్​ చేయగా.. భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు శవాలుగా కనిపించారు. 

ఘటనా స్థలంలో క్లూస్​ టీమ్ ఆధారాలు సేకరించింది. ఈమేరకు హత్య కేసుగా నమోదు చేసుకున్న ప్లెయిన్స్​బోరో పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. అనుమానితులకు సంబంధించిన వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని చుట్టుపక్కల వాళ్లకు పోలీసులు సూచించారు. మృతదేహాలను పోస్ట్​మార్టం కోసం ఆస్పత్రికి పంపారు. నలుగురు హత్యకు గురికావడాన్ని సీరియస్​గా తీసుకున్న పోలీసు అధికారులు.. ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. 

కాగా, దంపతులిద్దరూ ఐటీ ఉద్యోగులని, పదేండ్లుగా అక్కడే ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు చెప్పారు.