అభినందన్ విడుదలకు కారణం అమెరికా ఒత్తిడేనా?

పాకిస్థాన్ నుంచి మన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా విడుదల కావడానికి తెర వెనుక ఉండి అమెరికా తీవ్రంగా కృషి చేసింది. అమెరికా సైన్యా ధికారులు పాకిస్థాన్ ఆర్మీ ఆఫీసర్లతో ఒకటికి పదిసార్లు మాట్లాడి అభినందన్ విడుదలకు రూట్ క్లియర్ చేశారు. ఒక దశలో మెలికలు పెట్టి అభినందన్ ను ఇండియాకు అప్పగించకుండా చేయడానికి పాక్ పన్నిన కుటిల పన్నాగాన్ని అమెరికా తిప్పి కొట్టింది. సాక్షాత్తూ అమెరికానే రంగంలోకి దిగడంతో అభినందన్ను విడుదల చేయడం మినహా పాకిస్థాన్ కు మరో అప్షన్ లేకుండా పోయింది.

ఫిబ్రవరి 27న అభినందన్ వర్తమాన్ పాకిస్థాన్ భద్రతా దళాలకు పట్టు బడ్డప్పుడు దాయాది దేశం అతడిని విడుదల చేస్తుందా అనే అనుమానాలు తలెత్తాయి. యుద్ధ ఖైదీలు పట్టు బడ్డప్పుడు జెనీవా ఒప్పందం మేరకు వారిని సొంత దేశాలకు అప్పగించాలన్న రూల్ ఉంది. అయితే సహజంగా పాకిస్థా న్ ఇలాంటి రూల్స్ ను ఫాలో అయ్యే దేశం కాదు. కయ్యానికి కాలుదువ్వడమే పనిగా పెట్టు కున్న పాకిస్థాన్ కు యుద్ధ నీతి కూడా పట్టదు. ఒక దశలో అభినందన్ ను అడ్డం పెట్టుకుని ఇండియాతో కొట్లాటకు రెడీ అవుతుందన్న సమాచారం కూడా అందింది. అయితే చాలా కాలం పాటు పాకిస్థాన్ కు అండగా నిలబడ్డ అమెరికా కాదు …కూడదనేసరికి అభినందన్ ను విడుదల చేయడానికి బేషరతుగా ఒప్పుకున్నట్లు అంతర్జాతీయ వర్గాల సమాచారం.

అమెరికా సైన్యంలో పెద్ద పోస్టులో ఉన్న జనరల్ జోసెఫ్ ఓటెల్ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బావేజ్ తో అనేకసార్లు ఆయన మాట్లాడారు. అభినందన్ ను విడుదల చేయకపోతే పాకిస్థాన్ కే నష్టమంటూ హితబోధ చేశారు. అంతర్జా తీయ సమాజం అంతా టెర్రరిజానికి వ్యతిరేకంగా ఒకతాటిమీదకు వచ్చిన సమయంలో ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా లాంగ్ రన్ లో అన్ని విధాల నష్టపోయేది పాకిస్థానేనని హెచ్చరిక కూడా చేశారు. జోసెఫ్ ఓటెల్ ఒక్కడే కాదు అమెరికా సైన్యానికి చెందిన మరో పెద్దాఫీసరు జనరల్ జోసెఫ్ డన్ ఫోర్డ్ కూడా పాకిస్థాన్ కు చెందిన జనరల్ జుబేర్ మహమూద్ హయత్ తో అనేక సార్లు మాట్లాడారు. సాక్షాత్తూ అమెరికాయే రంగంలోకి దిగినా ఒక దశలో అభినందన్ విడుదలకు పాకిస్థా న్ సైన్యం అంగీకరించలేదని సమాచారం. అభినందన్ ను అడ్డం పెట్టుకుని ఇండియా మనోధైర్యాన్ని దెబ్బతీయాలని పాక్ ఆర్మీలోని కొంతమంది అధికారులు వ్యూహం పన్నారట. అయితే ఈ విషయంలో ప్రపంచంలోని ఏ ఒక్క దేశమూ తమకు అండగా నిలబడకపోయేసరికి పాకిస్థాన్ చివరకు కళ్లు తేలేసి పరిస్థితి వచ్చింది. అప్పటికే అంతర్జాతీయంగా పాకిస్థాన్ ఒంటరిదయింది.

టెర్రరిస్టు సంస్థలకు నిధుల వరద పారించినందుకు ‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ’ ( ఎఫ్ ఏ టీఎఫ్ ) పాకిస్థాన్ ను ‘గ్రే’ లిస్టులో పెట్టింది. దీంతో పాక్ కు ప్రపంచంలో ఎక్కడా రూపాయి అప్పు పుట్టని దారుణ పరిస్థితి నెలకొంది. దీంతో అమెరికా మాటను కాదంటే రాజకీయంగా అన్ని దారులు మూసుకుపోతాయన్న విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అర్థం చేసుకుంది. పాక్ సైన్యంతో ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ మనసులోని ఆలోచన వెల్లడించారు. సైనికాధికారులను ఒప్పించారు. అంతా ఓకే అనుకున్నాక అభినందన్ ను విడుదల చేస్తున్నట్లు పాక్ పార్లమెంటు వేదికగా ఇమ్రాన్ ఖాన్ ఓ స్పష్టమైన ప్రకటన చేశారు. రోడ్డు మార్గంలో తీసుకువచ్చి వాఘా బోర్డర్ లో అభినందన్ ను ఇండియాకు పాకిస్థాన్ అప్పగించింది.

జెనీవా ఒప్పందానికి పాక్ వక్ర భాష్యం
అభినందన్ ను విడుదల విషయంలో జెనీవా ఒప్పందానికే వక్రభాష్యం చెప్పడానికి ఒక దశలో పాకిస్థాన్ రెడీ అయ్యింది. అభినందన్ యుద్ద ఖైదీ కాదని, అందువల్ల జెనీవా ఒప్పందం వర్తించదని తప్పుడు భాష్యం చెప్పడానికి సిద్దమైంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగలేదని, కవ్వింపు చర్యల్లో భాగంగానే అభినందన్ తమ గగనతలంలోకి ప్రవేశించాడని వాదన రెడీ చేసుకుంది. అయితే అమెరికా సహా ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇక లాభం లేదనుకుని ప్లేట్ ఫిరాయించింది.

 

అభినందన్ విషయంలో వాషింగ్టన్ కీలక పాత్ర
వింగ్ కమాండర్ అభినందన్ ను ఇండియాకు అప్పగించే విషయంలో వాషింగ్టన్ కీలక పాత్ర పోషించిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హనోయ్ లో ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ అన్ తో భేటీ అయిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ యుద్ధ వాతావరణం నుంచి రెండు దేశాలను ఆపడానికి తాము ఎంతగానో కృషి చేశామన్నారు.

ఇండియాకు అండగా అరబ్ దేశాలు
వింగ్ కమాండర్ అభినందన్ విషయంలో అరబ్ దేశాలన్నీ ఇండియాకు మద్దతు పలకడం విశేషం. అబుదాబిలో జరిగిన ఇస్లా మిక్ కాన్ఫరెన్స్ ఆర్గ నైజేషన్ సమావేశంలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. అరబ్ దేశాల వైఖరిని ఆమె కొనియాడారు. ఇస్లా మిక్ కాన్ఫరెన్స్ ఆర్గనైజేషన్ సమావేశానికి ఇండియను ఆహ్వానిస్తే తాము వచ్చేది లేదని పాకిస్థా న్ చేసిన బెదిరింపులను ఖాతర చేయకుండా తనను గౌరవ అతిథిగా ఆహ్వానించడం సంతోషంగా ఉన్నదని సుష్మా స్వరాజ్ పేర్కొన్నారు.


అజిత్ దోవల్ కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ కాల్

అభినందన్ విడుదలకు అమెరికా సైన్యాధికారులే కాదు ఏకంగా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా కృషి చేశారు. మన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కు ఫోన్ చేసి దాదాపు అరగంట సేపు మాట్లాడినట్లు అంతర్జాతీయ వర్గాల సమాచారం. వింగ్ కమాండర్ ను గౌరవప్రదంగా ఇండియాకు పంపే విషయంలోనూ, రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొనే విషయంలోనూ పాంపియో కీ రోల్ ప్లే చేసినట్లు ఈ వర్గాలు వెల్లడించాయి.

జెనీవా ఒప్పందానికి పాక్ వక్ర భాష్యం

అభినందన్ ను విడుదల విషయంలో జెనీవా ఒప్పందానికే వక్రభాష్యం చెప్పడానికి ఒక దశలో పాకిస్థా న్ రెడీ అయ్యిం ది. అభినందన్ యుద్ద ఖైదీ కాదని, అందువల్ల జెనీవా ఒప్పందం వర్తించదని తప్పుడు భాష్యం చెప్పడానికి సిద్దమైంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగలేదని, కవ్వింపు చర్యల్లో భాగంగానే అభినందన్ తమ గగనతలంలోకి ప్రవేశించాడని వాదన రెడీ చేసుకుంది. అయితే అమెరికా సహా ప్రపంచదేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇక లాభం లేదనుకుని ప్లేట్ ఫిరాయించింది.