కెనడా వైపే అమెరికా మొగ్గు : నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుకు భారత్ సహకరించడంలేదని ఆరోపణ

కెనడా వైపే అమెరికా మొగ్గు : నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుకు భారత్ సహకరించడంలేదని ఆరోపణ

వాషింగ్టన్: భారత్, కెనడా వివాదంపై అమెరికా స్పందించింది. సిక్కు వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి భారత్ పై ఆరోపణలు చేస్తున్న కెనడాను అమెరికా వెనకేసుకొచ్చింది. ఈ కేసు దర్యాప్తుకు భారత్ సహకరించడంలేదని ఆరోపించింది. అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘కెనడా చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కెనడా చేస్తున్న దర్యాప్తుకు భారత్ సహకరించాలని మేం కోరుకుంటున్నాం. కానీ భారత్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది” అని మాథ్యూ మిల్లర్ ఆరోపించారు.

సమాచారముంటే ఇవ్వండి.. 


కెనడాలోని సిక్కులకు అక్కడి పోలీసులు ఓ ప్రకటన చేశారు. కెనడాలో ఇండియన్ ఏజెంట్లు రూల్స్ ఉల్లంఘించి ఉంటే, అందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మర్డర్లు, దోపిడీలు, బెదిరింపులు.. ఇలా ఏదైనా క్రైమ్​లో భారత ఏజెంట్ల హస్తం ఉంటే చెప్పాలని కోరారు.