భారతదేశం ప్రపంచశక్తిగా అవతరించడాన్ని స్వాగతిస్తున్నామని అమెరికా పేర్కొంది. అదేవిధంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇండియా తమ దేశానికి ముఖ్యమైన భాగస్వామి అని తెలిపింది. ‘ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారతదేశం మాకు చాలా ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి. భారతదేశం ఒక ప్రముఖ ప్రపంచ శక్తిగా అవతరించడం మరియు భద్రత విషయంలో భారత్ పాత్రను మేం స్వాగతిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
రక్షణ, విస్తరణ, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రాంతీయ సహకారం, ఉగ్రవాద నిరోధకత, శాంతి పరిరక్షణ, పర్యావరణం, ఆరోగ్యం, విద్య, సాంకేతికత, వ్యవసాయం, అంతరిక్ష మరియు మహాసముద్రాలతో సహా అనేక రకాల దౌత్య మరియు భద్రతా సమస్యలపై తాము భారత్‌కు సహకరిస్తామని ఆయన అన్నారు. భారత్‌కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారిందని.. ఈ రెండు దేశాల వాణిజ్యం 2019లో 146 బిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన అన్నారు.
For More News..