సెల్‌ఫోన్... మానవ జీవితాన్ని సులభతరం చేసిన ఒక ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్. చివరికి ఆరోగ్య సంబంధిత సందేహాలున్న స్మార్ట్ ఫోన్ చెప్పేస్తుంది. అయితే సైంటిస్టులు తయారు చేసిన ఒక యాప్ ఇప్పుడు యూజర్లను ఆకట్టుకుంటోంది. అదే 'ఫీవర్ యాప్'. దీనిని అమెరికాలోని వాషింగ్టన్ డీసీ యూనివర్సిటీ సైంటిస్ట్‌లు రూపొందించారు. దీనితో ఫోన్లోనే బాడీ టెంపరేచర్ తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌లోని టచ్ ప్యాడ్, సెన్సార్ల సాయంతో టెంపరేచర్ చెక్ చేసి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వివరాలు వెలువరించనున్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకురావడానికి ఇంకా కొన్ని పరీక్షలు చేయాలని చెప్పారు.
ఈ యాప్ ని ఉపయోగించాలంటే ఎదుటి వ్యక్తి ఫోన్ తాకనవసరం లేకుండా, యాప్ తెరిచి, కెమెరా లెన్స్ ను రోగి నుదిటిపై 90 సెకన్ల పాటు ఉంచితే సరిపోతుంది. థర్మామీటర్‌తో పోల్చితే 0.23 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని శాస్ర్తవేత్తలు చెప్పారు. ఇది సత్ఫలితాలిస్తోందని వెల్లడించారు. మరిన్ని పరీక్షల అనంతరం అందుబాటులోకి తెస్తామని వారు తెలిపారు.