ఆఫ్ఘనిస్తాన్‌పై అమెరికా గత సంవత్సరం రికార్డు స్థాయిలో బాంబులను వేసింది. గత సంవత్సరం 2019 మొత్తంగా చూస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌లోని తమ లక్ష్యాలను చేధించడం కోసం అమెరికా ఏకంగా 7,423 బాంబులను వేసి తన రికార్డును తానే తిరగరాసింది. అమెరికా 2018లో ఆఫ్ఘనిస్తాన్‌పై 7,362 బాంబులను వేసింది.
అమెరికా మరియు ఆఫ్ఘన్ దళాల బాంబుల దాడులతో స్ధానిక పౌరులు మృత్యువాత పడటం బాగా పెరిగింది. దాంతో ఐక్యరాజ్యసమితి మరియు హక్కుల సంఘాలు తమ ఆందోళనలను వ్యక్తం చేశాయి. తాజాగా.. ఆదివారం కూడా ఉత్తర బాల్ఖ్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ వైమానిక దాడుల్లో ముగ్గురు పిల్లలతో సహా ఏడుగురు పౌరులు మరణించారు. దాంతో స్థానికుల నుండి నిరసనలు వెల్లువెత్తాయి.
గత నెలలో తాలిబన్ కమాండర్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా చేసిన డ్రోన్ దాడిలో ఎక్కువ సంఖ్యలోనే పౌరులు మరణించారు. ఐరాస ప్రకారం.. 2019 మొదటి అర్ధభాగంలో అమెరికాతో సహా ఆఫ్ఘన్ ప్రభుత్వ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో సుమారు 717 మంది పౌరులు మరణించారు. అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగాలని తాలిబన్లు అమెరికాతో చర్చలు జరుపుతున్నాయి. అవి సఫలమయితే కొంతవరకు ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులు తగ్గుతాయి.
For More News..