![భారత్‌కు అమెరికా యుద్ధ విమానాలు.. ప్రధాని మోడీ, ట్రంప్ స్పెషల్ డీల్](https://static.v6velugu.com/uploads/2025/02/america-will-sell-f35-fighter-jets-to-india_geLJWBK9xt.jpg)
భారత్‌కు అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాలను విక్రయించేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘అమెరికా-భారత్ కోసం అద్భుతమైన వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోతున్నాం. సమీప భవిష్యత్తులోనే భారీ ఒప్పందాన్ని ప్రకటిస్తాం. అమెరికాలో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను భారత్ మరింతగా కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి భారత్‌కు మిలిటరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచుతాం. ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను కూడా విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ తెలిపారు. 26/11 కుట్రదారుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు ట్రంప్ సంసిద్ధత వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ విషయాన్ని ప్రస్తావించగా.. ఆ విషయం మోదీ చూసుకుంటారంటూ ట్రంప్ చమత్కరించారు.
మిత్రమా చాలా మిస్సయ్యాను
ఫ్రాన్స్ నుంచి అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత కాలమానం ప్రకారం ఇవాళ తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ వైట్ హౌస్‌లో ట్రంప్‌తో భేటీ అయ్యారు. వెస్ట్‌లాబీలో ఉన్న ట్రంప్‌తో మోదీ కరచాలనం చేశారు. అనంతరం, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ‘మిత్రమా నేను మిమ్మల్ని చాలా మిస్సయ్యాను’ అంటూ ట్రంప్ మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మోదీ సైతం ట్రంప్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆ ఆసక్తిర సన్నివేశాన్ని వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు.