
వేరే భాషల సినిమాలు తెలుగులో రీమేక్ అవ్వడం ఎప్పుడూ జరిగేదే. ఇప్పుడు వెబ్ సిరీసులు కూడా రీమేక్ అవుతున్నాయి. అమెరికన్ రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘మోడర్న్ లవ్’ని తెలుగు (మోడర్న్ లవ్ హైదరాబాద్), తమిళ (మోడర్న్ లవ్ చెన్నై), హిందీ (మోడర్న్ లవ్ ముంబై) భాషల్లో తీయబోతున్నట్టు అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. ఈ సూపర్ హిట్ సిరీస్‌లో పదహారు ఎపిసోడ్స్ ఉంటాయి. ఎనిమిదేసి ఎపిసోడ్స్ చొప్పున రెండు సీజన్లుగా 2019, 2021లో స్ట్రీమ్ అయ్యాయి. ఇండియన్ కల్చర్‌కి అడాప్ట్ అయ్యే అవకాశం ఉన్న స్క్రిప్ట్ కావడం, ఇక్కడి ప్రేక్షకుల్ని కనెక్ట్ చేయగలిగే ఎమోషన్స్ కూడా ఉండటంతో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నట్టు అమెజాన్ సంస్థ చెబుతోంది. ఒరిజినల్లో ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్, ఆస్కార్ అవార్డ్ విన్నర్ యాన్ హాత్వే ఓ కీలక పాత్రలో నటించింది. మరి ఆ పాత్రని తెలుగులో ఎవరు పోషిస్తారో చూడాలి.