న్యూయార్క్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ అయిన అమెరికన్ ఎయిర్లైన్స్సేవలకు ఆటంకం కలిగింది. మంగళవారం క్రిస్మస్ వేళ సాంకేతిక లోపంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. టెక్నికల్ ఇష్యూ కారణంగా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలన్నీ నిలిపేయాలని ఫెడరల్‌ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) ఆదేశించింది. దీంతో గంటకుపైగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అమెరికాలో క్రిస్మస్ సెలవుల వేళ లక్షలాది మంది విమానాల్లో ప్రయాణిస్తుంటారు.
ఇలాంటి కీలక సమయంలో విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడడంతో అవస్థలు పడ్డారు. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా, ఈ అంశంపై ఎయిర్లైన్స్సంస్థ ఎక్స్‌లో పోస్ట్పెట్టింది. సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని, ప్రయాణికులందరూ సంయమనం పాటించాలని కోరింది. కాగా, కొద్ది గంటల తర్వాత టెక్నికల్ సమస్యను పరిష్కరించడంతో విమాన సర్వీసులు యథావిధిగా నడిచాయి.