అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు నిలిపివేత

 అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాలు నిలిపివేత

ప్రపంచలోనే అతిపెద్దదైన అమెరికన్ ఎయిర్ లైన్స్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో యూనైటైడ్ స్టేట్స్ లోని అన్ని  విమాన సర్వీసులను  నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అమెరికన్ ఎయిర్ లైన్స్.దీంతో విమానాలన్నీ ఎయిర్ పోర్టులకే పరిమితం అయ్యాయి

 క్రిస్మస్ వేళ లక్షల మంది  ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు గాస్తున్నారు. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

అయితే  వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నామని ఎయిర్ లైన్స్  తెలిపింది. అనుకోకుండా తలెత్తిన ఈ సమస్యతో అసౌకర్యానికి గురైన ప్రయాణికులు క్షమించాలని కోరింది. 
 

Announcement from American Airlines as we wait at @FLLFlyer @AmericanAir pic.twitter.com/zL4137ih4g

— Anna McAllister (@annamactv) December 24, 2024