టీ20 ప్రపంచకప్ 2024లో సంచలన విజయం నమోదైంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన పాకిస్తాన్ జట్టు.. క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న అమెరికా చేతిలో పరాజయం పాలైంది. ఓటమినుంచి గట్టెక్కే అవకాశాలు వచ్చినప్పటికీ.. బాబర్ సేన చేజేతులా చేజార్చుకుంది. సూపర్ ఓవర్‌లో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన అమెరికా జట్టు కూడా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారితీసింది.
సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18 పరుగులు చేయగా, ఛేదనలో పాకిస్తాన్ 13 పరుగులకే పరిమితమైంది. దీంతో అమెరికా 5 పరుగుల తేడాతో పాక్ పై గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో పాక్ అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డిండ్ అన్నింటా లోపాలే.
సంక్షిప్త స్కోర్లు:
- పాకిస్థాన్: 20 ఓవర్లలో 159/7
- అమెరికా: 20 ఓవర్లలో 159/3
సూపర్ ఓవర్ స్కోర్లు
- అమెరికా: 18/1
- పాకిస్థాన్: 13/1
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మోనాంక్ పటేల్