హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయీ బెనిఫిట్ సూట్, టూల్స్ అందించే అమెరికా కంపెనీ క్లారిటీ బెనిఫిట్ సొల్యూషన్స్ హైదరాబాద్‌లో తమ శాఖను ఏర్పాటు చేసింది. ఎన్నోబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఉన్న సాంకేతిక బృందంతో భారతీయ అనుబంధ సంస్థను నెలకొల్పింది.
ఈ సందర్భంగా క్లారిటీ బెనిఫిట్ సొల్యూషన్స్ ఫౌండర్, సీఈఓ బిల్ కాటుజీ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా వేలాది చిన్న, మధ్య తరహా వ్యాపారులకు వినూత్న పరిష్కారాలు అందించడంలో ముందంజలో ఉన్నామన్నారు. భారత సబ్సిడరీతో కంపెనీ గ్లోబల్ సామర్థ్యాలు మెరుగుపడతాయని చెప్పారు. ఐటీ, ఫైనాన్స్ కార్యకలాపాలలో భారతదేశంలో వర్క్‌ఫోర్స్‌ను పెంచుతామని తెలిపారు.