అమెరికా ఫస్ట్ లేడీస్ అందరూ ఆ రంగు బట్టలే ఎందుకు వేసుకుంటారో తెలుసా? 

బుధవారం జరిగిన జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి చాలామంది సెలబ్రిటీలు వచ్చారు. అందులో మిషెల్ ఒబామా, హిల్లరీ క్లింటన్ కూడా ఉన్నారు. వీళ్లిద్దరూ ఇంతకు ముందు అమెరికా ఫస్ట్​ లేడీస్.  హిల్లరీ క్లింటన్ 2016 డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ నామినీ కూడా,  వీరితో పాటు  సెనేటర్ ఎలిజబెత్ వారెన్ కూడా వచ్చారు. అయితే… ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్‌గా ప్రమాణ స్వీకారం చేసిన ‘కమలా హ్యారిస్​’తో సహా. అందరూ పర్పుల్ కలర్‌‌ షేడ్స్ ఉన్న బట్టలే వేసుకున్నారు.

బైడెన్ వైఫ్, ఫస్ట్​ లేడీ జిల్ బైడెన్ కూడా మంగళవారం రాత్రి లింకన్ మెమోరియల్ రిఫ్లెక్టింగ్ పూల్ దగ్గరకి వెళ్లినప్పుడు కూడా ఇదే కలర్ డ్రెస్ వేసుకున్నారు. అయితే ఇలా ఒకే రకమైన రంగు వేసుకోవటం అనుకోకుండా జరిగింది కాదు. ఆ పర్పుల్ షేడ్ డ్రెస్‌లు కావాలనే వేసుకున్నారు వాళ్లు.

“రెడ్” డెమొక్రటిక్ పార్టీ రంగు, “బ్లూ” రిపబ్లికన్ పార్టీ రంగు. ఈ రెండూ కలిస్తే పర్పుల్ షేడ్ వస్తుంది.

మహిళల ఓటు హక్కు ఉద్యమంలో ఈ కలర్ బాగా పాపులర్​ అయ్యింది.  అందుకే ఆ రెండు కలిసి పోయిన కలర్‌‌ని  వేసుకున్నారట.  2019 లో ప్రెసిడెంట్​ ఎన్నికల హారిస్‌ చేసిన ప్రచారంలో ఇదే రంగును ఎక్కువగా వాడేది.

ఆమె ఎన్నికల  ప్రచారంలో ఎక్కువగా వేసుకున్నది పర్పుల్ కలర్ డ్రెస్​లనే.

For More News..

బైడెన్‌ ఫాలో అయ్యే ఒకే ఒక్క సెలబ్రిటీ.. ఎవరు, ఎందుకో తెలుసా?

ప్రతీ వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాన్నకే అంకితం.. ఇంత గొప్ప పెర్ ఫామెన్స్‌ ఊహించలేదు

కరోనా తర్వాత పెద్ద ఫ్లాట్లను కోరుకుంటున్న జనాలు