న్యూఢిల్లీ: చంద్రయాన్3ని సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి తమ వంతు సాయం చేస్తామని అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా), యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) ముందుకొచ్చాయి. ‘‘ఇస్రో.. మీ వెంట మేమున్నాం. మీకు మా సహాయ సహకా రాలు అందిస్తాం”అంటూ చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్‌లో నాసా, ఈఎస్‌ఏ సాయం చేస్తున్నాయి. చంద్రయాన్ 3ని ట్రాక్ చేయడానికి బెంగళూరులో దగ్గర్ల లోని బైలాలులో దేశంలోనే అతి పెద్దదైన 32 మీటర్ల డిష్ యాంటెన్నాను ఏర్పాటు చేశారు.
ల్యాండర్ నీడ ఉన్న ప్రాంతానికి వెళ్లినప్పుడు దానిని ట్రాక్ చేయలేం. అప్పుడే నాసా, ఈఎస్‌ఏల డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లు ల్యాండర్‌ను ట్రాక్ చేస్తాయి. మన యాంటె న్నా సిగ్నల్‌కు అందనప్పుడు నాసా, ఈఎస్‌ఏ ల్యాండర్‌తో కమ్యూని కేట్ చేసి, బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ టీమ్‌కి సమాచారమిస్తాయి. ఇస్రో తన సొంత నెట్‌వర్క్ ద్వారా ల్యాండర్‌ను యాక్సెస్ చేయలేనప్పుడు నాసా, ఈఎస్‌ఏ కమ్యూనికేషన్ లింక్‌గా పనిచేస్తాయి.