గాఫ్‌‌ తొలిసారి..డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ సొంతం

గాఫ్‌‌ తొలిసారి..డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ సొంతం

రియాద్‌‌ : అమెరికా టెన్నిస్‌‌ స్టార్ కొకో గాఫ్‌‌  కెరీర్‌‌‌‌లో తొలిసారి సీజన్ ఎండింగ్‌‌ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్‌‌ చాంపియన్‌‌గా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి అదరగొడుతూ.. వరల్డ్ టాప్‌‌2 ప్లేయర్లు అరీనా సబలెంకా, ఇగా స్వైటెక్‌‌ను ఓడిస్తూ ముందుకొచ్చిన గాఫ్‌‌ తుదిపోరులో ఒలింపిక్ చాంపియన్‌‌ జెంగ్‌‌ క్విన్వెన్‌‌ పని పట్టింది. శనివారం రాత్రి జరిగిన హోరాహోరీగా సాగిన ఫైనల్లో 20 ఏండ్ల గాఫ్‌‌ 3–6, 6–4, 7–6 (7/2)తో   చైనాకు చెందిన క్విన్వెన్‌‌పై పోరాడి విజయం సాధించింది.  

సెరెనా విలియమ్స్‌‌ తర్వాత 2014 నుంచి ఈ టోర్నీలో గెలిచిన తొలి అమెరికన్‌‌గా గాఫ్‌‌ నిలిచింది. అలాగే, మరియా షరపోవా (2004) తర్వాత విజేతగా నిలిచిన యంగెస్ట్‌‌ ప్లేయర్‌‌‌‌గానూ రికార్డుకెక్కింది. ట్రోఫీతో పాటు 4.8 బిలియన్ డాలర్ల (రూ. 40.50 కోట్లు) భారీ ప్రైజ్‌‌మనీ సొంతం చేసుకుంది.

మరోవైపు డబుల్స్‌‌ ఫైనల్లో గాబ్రియెలా దబ్రౌస్కి (కెనడా)–ఎరిన్ రౌట్‌‌లైఫ్ (న్యూజిలాండ్‌‌) 7–5, 6–3తో క్యాథెరినా సినియకొవా (చెక్ రిపబ్లిక్‌‌)–టేలర్‌‌‌‌ టౌన్‌‌సెండ్ (అమెరికా)ను ఓడించి టైటిల్ నెగ్గారు.