ఏనుగు దాడి చేసిన ఘటనలో ఓ మహిళా టూరిస్ట్ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఆఫ్రికాలోని కఫ్యూ నేషనల్ పార్క్‌లో చోటుచేసుకుంది. టూరిస్ట్‌లతో వెళ్తున్న సఫారీ వాహనంపైకి ఏనుగు ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీంతో ఆ సఫారీ వాహనంలోని టూరిస్ట్‌లు భయంతో వణికిపోయారు. ఇందులో 80 ఏళ్ల అమెరికన్ మహిళ మరణించగా ... సుమారు ఐదుగురు టూరిస్ట్‌లు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం.
కఫ్యూ నేషనల్ పార్క్‌లో కొందరు టూరిస్ట్‌లు సఫారీ వాహనంపై ఏనుగులు ఉన్న ప్రదేశానికి వెళ్లారు. అందులోని వారంతా ఏనుగులను చూస్తూ వాటి కదలికలను తమ వద్ద ఉన్న కెమెరాల్లో వీడియోలు ఫోటోలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఏనుగు వచ్చి సడన్ గా వారిపైకి దూసికెళ్లింది. దీంతో వారు వాహానాన్ని వెనక్కి తిప్పారు.
ALSO READ :- ఇండియన్ అబ్బాయి..లండన్ అమ్మాయి .. మంచిర్యాలలో పెళ్లి
దాదాపుగా అర కిలోమీటరు వరకు ఏనుగు అతి వేగంతో వెంబడించింది. అనంతరం ట్రక్కుపై దాడి చేసి దాన్ని బోల్తా కొట్టించింది. టూరిస్ట్ ట్రక్కును ఏనుగు వెంబడించి దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఏనుగు వెంబడించినప్పుడు పర్యాటకులు భయాందోళనలు, అరుపులు వినవచ్చు.
NEW: American tourist killed after an enraged bull elephant attacks a safari truck in the Kafue National Park in Africa.
— Collin Rugg (@CollinRugg) April 3, 2024
The elephant reportedly separated from the herd to chase the vehicle traveling about 25 mph.
The elephant caught up to the vehicle and charged, flipping the… pic.twitter.com/Sy3t6JoA4S