ఐదు దశాబ్దాల తర్వాత సోమవారం (ఏప్రిల్8) సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఉత్తర అమెరికా అంతటా సోమవారం పగటి పూట చీకట్లు కమ్ముకున్నాయి..ఆకాశంలో నక్షత్రాలు కనిపించాయి. ఈ ఖగోళ అద్బుతాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. అమెరికా, మెక్సికో, కెనడా వంటి దేశాల్లో స్కైవాచర్లు ఖగోళ అద్భుతాన్ని ప్రత్యేక ఏర్పాట్లతో అమెరికన్లు ఎంజాయ్ మ్యూజిక్ తో ఎంజాయ్ చేశారు. కొందరైతై పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. అయితే పక్షులు, జంతువుల్లో మాత్రం అలజడిగా ఉన్నాయి. ఎందుకో తెలుసుకుందాం..
ఉత్తర అమెరికా అంతటా స్కైవాచర్లు సోమవారం మధ్యాహ్నం ఖగోళ అద్భుతాన్ని ఎంజాయ్ చేశారు. ఏడేళ్ల తర్వాత ఖండాన్ని చీకటిగా మార్చిన మొదటి సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అనందోత్సాహాలతో జరుపుకున్నారు. మ్యూజిక్ తో ఎంజాయ్ చేశారు. కొందరు పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. మెక్సికన్ బీచ్ రిసార్ట్ నుంచి గ్రహణం ఓహియో నది ఒడ్డు వరకు , యూఎష్ , కెనడియన్ సరిహద్దులలో నయగార జలపాతంవద్ద పగటిపూట చీకట్లను జనాలు ఎంజాయ్ చేశారు.
సోమవారం నాటి సంపూర్ణ గ్రహణం 4నిమిషాల 28 సెకన్లు వరకు కొనసాగింది. శాన్ ఆంటోనియో, ఆస్టిన్, డల్లాస్, టెక్సాస్ వంటి ప్రధాన నగరాలు, ఇండియానా పోలిస్, ఇండియాన , క్లీవ్ ల్యాండ్, ఒహియో, ఎరీ, పెన్సిల్వేనియా, మాంట్రియాల్ , క్యూబెక్ వంటి ప్రాంతాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించింది.
సూర్యగ్రహణం రోజున ఒక్కసారిగా చీకట్లు కమ్ముకోవడంతో పక్షులు ఆందోళనకు గురవుతాయి. అకస్మాత్తుగా చీకట్లతో రాత్రి అయినట్టు భావిస్తాయి.. గూటికి చేసుకునేందుకు ప్రయత్నిస్తాయి.. ఇంతలో తిరిగి వెలుతురు రావడంతో అవి ఇదంతా ఓ భ్రమలా భావించి తిరిగి ఆహార వేటలో ఎగిరిపోతాయి.
ఇక జంతువుల విషయానికొస్తే.. జంతువులు సూర్యగ్రహణ సమయంలో ఎక్కువగా సంతానోత్పత్తికి ప్రయత్నిస్తాయంటున్నారు జంతు పరిశోధకులు. సౌత్ కరోలినాలోని కొంలబియాల రివర్స్ బ్యాంక్స్ జూలో గాలా పాగోస్ తాబేళ్లు రోజంతా ఏమీ చేయవు. గ్రహణం సమయంలో మాత్రం అవన్నీ సంతానోత్పత్తి చేయడం ప్రారంభిస్తాయని అంటున్నారు. ప్రవర్తనకు కారణం ఇప్పటికీ అస్పష్టంగా ఉందంటున్నారు జంతు పరిశోధకులు.
సంపూర్ణ సూర్యగ్రహణం పగలు రాత్రిగా మారినప్పుడు తాబేళ్లు శృంగారంలో పాల్గొన్నాయంటున్నారు. కోతులు, జిరాఫీలు వింత వింత శబ్దాలు చేస్తాయంటున్నారు. ఇక రాజహంసలయితే తమ పిల్లలను దగ్గరగా తీసుకొని ప్రేమతోలాలిస్తాయట.