మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం రంగాపురం విలేజ్ లో ఆదివారం అమెరికా దేశస్తులు ఎలీష్ బెల్స్,మ్యాతుస్ జాకబ్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వారికి డప్పు చప్పులతో స్వాగతం పలికారు. అనంతరం ఐటీసీ కంపెనీ ప్రతినిధి అమరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
రంగాపురంలో దాదాపు 800 ఎకరాల్లో అత్యధికంగా మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తున్న మిర్చి పంట పనితీరు,పెట్టుబడి,దిగుబడి,ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ పిచికారి చేస్తున్న వివరాలను అమెరికా దేశస్థులు రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఐటిసి కంపెనీ ప్రతినిధి సతీష్, వైస్ ఎంపీపీ రాజేశ్వర్ రావు,భగీరథ రాజేశ్వర్ రావు, ఐటీసీ కంపెనీ బృందం సభ్యులు అమర్, విజేందర్ రావు,కుమార్,రమేష్ పాల్గొన్నారు.