
వాషింగ్టన్: కొన్నేండ్లుగా జరుగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా చూడాలని భారత్‌ను రష్యా కోరింది. ఇందుకోసం రష్యాతో ఉన్న దీర్ఘకాల సంబంధాలను ఉపయోగించుకోవాలని సూచించింది. ‘‘పుతిన్‌కు మీరైనా నచ్చజెప్పండి’’ అని మోదీని కోరింది. సోమవారం యూఎస్స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్మీడియా సమావేశంలో మాట్లాడారు. యూఎన్ చార్టర్‌ను గౌరవించాలని పుతిన్‌కు చెప్పాలని భారత్‌ను కోరారు. భారత్‌తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని, అందుకే రష్యాతో మాట్లాడాలని ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. అలాగే, చట్ట విరుద్ధమైన యుద్ధాన్ని ముగించి, శాంతిని నెలకొల్పేలా పుతిన్‌తో మాట్లాడాలని కోరుతున్నామన్నారు.