ఓరుగల్లు టీచర్​కు అమెరికా ఫుల్ బ్రైట్ పురస్కారం

ఐనవోలు, వెలుగు :  ప్రభుత్వ ఉపాధ్యాయుడు డాక్టర్ కోలా రవీందర్ అరుదైన ఘనత సాధించారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఇంగ్లిష్ టీచర్ గా పని చేస్తున్న రవీందర్, అమెరికా ప్రభుత్వ ఆధ్వర్యంలో  నిర్వ హించే ఫుల్ బ్రైట్ పురస్కారానికి ఎంపికయ్యారు.  ఫుల్ బ్రైట్ డిస్టింగ్విష్డ్ అవార్డ్ ఫర్ ఇంటర్నేషనల్ టీచర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్.డి.ఎ.ఐ) అనేది యూఎస్ డిపార్ట్​మెంట్​ ఆఫ్ స్టేట్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్,  ఐఆర్ఎక్స్ కలిసి స్పాన్సర్ చేసే ప్రోగ్రామ్.  అంతర్జాతీయంగా విద్యావేత్తల మధ్య సాంస్కృతిక సంబంధాలను పెంపొందించడం ఈ ప్రోగ్రామ్ లక్ష్యం.   ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా 16 దేశాల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తారు. 

చాలా తీవ్రంగా ఉండే ఈ పోటీలో 50 మందిని మాత్రమే తీసుకుంటారు. ఇంతటి కష్టతరమైన కార్యక్రమంలో మనదేశం నుంచి ఆరుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఇందులో సౌతిండియా నుంచి ఎన్నికైన ఒకే ఒక్క టీచర్ డాక్టర్ కోలా రవీందర్. ఇతడు ఈ నెల 15న అమెరికా బయలుదేరి వెళ్లారు. కోలా రవీందర్ వరంగల్​కరీమాబాద్ కు చెందినవారు.  ఆయన అమెరికా పురస్కారానికి ఎంపిక కావడంపై పంథిని జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్  ఎస్.శ్రీదేవి, సహచర టీచర్లు హర్షం వ్యక్తం చేశారు.