మళ్లీ తడబడ్డ బైడెన్.. గాజాకు బదులు ఉక్రెయిన్ పేరు పలికిన అమెరికా ప్రెసిడెంట్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జ్ఞాపకశక్తి తగ్గిపోయిందని ప్రచారం జరుగుతున్న వేళ ఆయన మరోసారి తడబడ్డారు. విమానాల ద్వారా ఆహారం, ఇతర సరఫరాలను ఉక్రెయిన్ లోకి  జారవిడుస్తామని బైడెన్ తెలిపారు.  గాజాకు బదులుగా ఉక్రెయిన్ అని పొరపాటున ఆయన చెప్పారు. బైడెన్ శుక్రవారం వైట్ హౌస్ లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి అతిథ్యం ఇచ్చారు. అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆ తర్వాత వైట్ హౌస్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ ఈ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. బైడెన్ గాజాకు బదులు ఉక్రెయిన్ అని చెప్పారని పేర్కొన్నారు.  ‘‘రాబోయే రోజుల్లో జోర్డాన్, ఇతర మిత్ర దేశాలతో కలిసి ఆహారం, ఇతర సరఫరాలను విమానాల ద్వారా జారవిడుస్తాం. సుముద్ర మార్గంతో సహా ఇతర మార్గాలను తెరవడానికి ప్రయత్నిస్తాం”అని జో బైడెన్ పేర్కొన్నారు.