మీరు అక్కడికి వెళుతుంటే మాస్క్ మస్ట్.. లేకుంటే రానీయరు

మీరు అక్కడికి వెళుతుంటే మాస్క్ మస్ట్.. లేకుంటే రానీయరు

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలో నమోదైన కేసులతో ఇదే సమయంలో కేంద్రం అలర్ట్ అయింది. మరోవైపు  మూడు రాష్ట్రాల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి చేసారు. ఒడిశాలో కరోనా కేసులు  3,000 మార్కును దాటినందున  మాస్క్‌లు  తప్పనిసరి చేసింది. ప్రస్తుతం  3,086 మంది కరోనావైరస్-సోకిన రోగులు ఉన్నారని  పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్  తెలిపారు.జలుబు, దగ్గు, జ్వరం మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలను ఉన్నవారిని  కోవిడ్  టెస్ట్ చేయించుకోవాలని  పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ నిరంజన్ మిశ్రా తెలిపారు.  రద్దీగా ఉండే ప్రదేశాల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ శానిటైజర్ వాడాలని సూచించారు.  కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.