Stocks to Buy: కేంద్రం శుభవార్త.. లాభపడే స్టాక్స్ ఇవే, త్వరపడండి..?

Stocks to Buy: కేంద్రం శుభవార్త.. లాభపడే స్టాక్స్ ఇవే, త్వరపడండి..?

Railway Stocks: గడచిన వారం దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు పెట్టుబడిదారులకు పెద్ద పీడకలను మిగిల్చాయి. నెమ్మదిగా కరెక్షన్ ఫేజ్ దాటి ముందుకెళుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లపై హఠాత్తుటా ట్రంప్ ప్రకటించిన ట్రేడ్ టారిఫ్స్ బాంబు ఆందోళనలు రేకెత్తించింది. ఆసియాతో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్లు భయంతో వణికి పోగా.. అమెరికా మార్కెట్లు కూడా ఇన్వెస్టర్ల డబ్బును భారీగానే హరించాయి.

ఈ క్రమంలో పెట్టుబడిదారులు వచ్చేవారం మార్కెట్లు ఎలా ఉంటాయి, ఎలాంటి ప్రణాళికలతో ముందుకు సాగాలనే ప్లాన్లో ఉన్నారు. వాస్తవానికి రిజర్వు బ్యాంక్ ద్రవ్యపరపతి సమావేశం ఉన్నందున వడ్డీ రేట్లపై ప్రకటన వచ్చేంత వరకు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ముందుకు సాగటం ముఖ్యం. అయితే శుక్రవారం భారత ప్రభుత్వం రైల్వేలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఏకంగా నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. దీంతో మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు మేలు జరగనుంది. ఈ మెుత్తం రైల్వే ప్రాజెక్టుల విలువ ఏకంగా రూ.18వేల 658 కోట్లుగా ఉంది.

Also Read:-టాటాల నుంచి రూ.15వేల కోట్ల ఐపీవో.. బెట్ వేసేందుకు గెట్ రెడీ!

అయితే ప్రస్తుతం క్యాబినెట్లో మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేసిన కీలక ప్రకటన ద్వారా కొత్తగా వెయ్యి 247 కిలోమీటర్ల మేర ట్రాక్స్ నిర్మాణం జరగనుందని వెల్లడైంది. దీనివల్ల స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన రైల్వే కంపెనీలకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడైంది. పెట్టుబడిదారులు ఈ అవకాశాన్ని తెలివిగా వినియోగించుకోవటం ద్వారా లాభపొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐఆర్ఎఫ్సీ లిమిటెడ్ కంపెనీల షేర్లపై పెట్టుబడిదారులు ఓ కన్నేసి ఉండటం మంచిదని వారు చెబుతున్నారు. అలాగే పెట్టుబడికి సరైన అవకాశాలను రైల్వే షేర్లలో గుర్తించి వినియోగించుకోవటం లాభదాయకంగా వారు భావిస్తున్నారు.

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.