
అహ్మదాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు గుజరాత్లో పర్యటించనున్నారు. పార్టీ సంస్థాగత ప్రక్షాళన, గుజరాత్ జిల్లాల కాంగ్రెస్ కమిటీ-ల అధ్యక్షులను ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ మొదలుపెట్టింది. అందులో భాగంగా 42 మందిని ఏఐసీసీ పరిశీలకులు, 183 మందిని పీసీసీ పరిశీలకులుగా నియమించింది.
పరీశీలకులు రాష్ట్ర వ్యాప్త కసరత్తును ప్రారంభించడానికి ముందు మంగళవారం (ఏప్రిల్ 15) అహ్మదాబాద్ లో వీరితో రాహుల్ గాంధీ సమావేశం నిర్వహిస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు శక్తి సిన్హ్ గోహిల్ తెలిపారు. బుధవారం రాహుల్ గాంధీ అర్వల్లి జిల్లా మోడాసా పట్టణంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా యూనిట్లకు అధ్యక్షులను ఎంపిక చేసే పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.