ట్రంప్ తరిమేస్తుంటే.. చైనా రమ్మంటోంది.. ఇండియన్స్కు 85 వేల వీసాలు జారీ చేసి రికార్డ్

ట్రంప్ తరిమేస్తుంటే.. చైనా రమ్మంటోంది.. ఇండియన్స్కు 85 వేల వీసాలు జారీ చేసి రికార్డ్

అమెరికాలో అక్రమ వలసదారులు పెరిగిపోయారని.. తమ దేశంలో దొబ్బి తింటున్నారని.. యుద్ధ ఖైదీలను ట్రీట్ చేసినట్లుగా బేడీలతో ఇమ్మిగ్రెంట్స్ ను ట్రంప్ తమతమ దేశాలకు తరిమేస్తున్నాడు. అందులో ముఖ్యంగా ఇండియన్స్ తమ దేశంలో అత్యధికంగా ఉన్నారని, ప్రత్యేక యుద్ధ విమానాలలో తీసుకొచ్చి ఇండియాలో దింపేశారు. ఆ తర్వాత అక్రమంగా ఎవరు కనిపించినా జైలు పాలవుతారని హెచ్చరించారు. చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకోవటానికి వెళ్లిన సగటు జీవులకు ట్రంప్ నిద్రలేకుండా చేయటమే కాకుండా యూఎస్ నుంచి తరిమేస్తున్న వేళ.. చైనా ఇండియన్స్ కు ఆపన్న హస్తం అందిస్తోంది. అమెరికా తరిమేస్తున్న వేళ.. దాన్ని క్యాష్ చేసుకోవాలని చైనా భావిస్తోంది. 

‘‘అమెరికా వద్దంటే ఏం.. మా దేశానికి రండి.. మా దగ్గర చదువుకోండి.. ఉద్యోగాలు చేసుకండి’’ అన్నట్లుగా గతంలో ఎన్నడూ లేనంతగా ఇండియన్స్ కు భారీగా వీసాలు మంజూరు చేసింది. 2025 జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు విదేశాంగ శాఖ చెప్పిన లెక్కల ప్రకారం మొత్తం 85 వేల వీసాలను జారీ చేసింది ఇండియాలో ఉన్న చైనా ఎంబసీ. దీనిపై చైనా రాయబారి క్సూ ఫెయిహాంగ్ స్పందించారు. ‘‘ మొత్తం 85 వేల ఇండియన్ సిటిజెన్స్ కు వీసాలు మంజూరు చేశాం. చైనాకు ప్రశాంతంగా వచ్చేయండి. చైనా కల్చర్ ను ఆస్వాదించండి. చైనా అందించే స్నేహపూరిత హస్తాన్ని అందుకోండి’’ అని కామెంట్ చేశారు.

Also Read:-డెలివరీలన్నీ ఆపేయాలని బోయింగ్ కంపెనీకి​ చైనా షాక్.. 

ఇండియా ప్రయాణికులకు వీసా నిబంధనల సడలింపులు:

ఒకవైపు అమెరికా తరిమేస్తున్న వేళ.. చైనా క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. అందులో భాగంగా ఇండియా ప్రయాణికులకు రూల్స్ లో చాలా వరకు సడలీకరించారు. అవి:

ఆన్లైన్ అపాయింట్మెంట్ లేదు:

ఎలాంటి ఆన్లైన్ అపాయింట్మెంట్ అపాయింట్ మెంట్ లేకుండానే డైరెక్ట్ గా వీసా అప్లికేషన్లను సబ్మిట్ చేసుకోవచ్చు.

బయోమెట్రిక్ నుంచి మినహాయింపు:

షార్ట్ టైమ్ లో చైనా విజిట్ చేయాలనుకునే వారికి బయోమెట్రిక్ ఎక్జెంప్షన్ ఇచ్చారు. ప్రాసెసింట్ టైమ్ కూడా తగ్గించారు. 

తగ్గించిన వీసా రేట్లు:

గతంతో పోల్చితే వీసా రేట్లను భారీగా తగ్గించింది చైనా. అందరికీ అందుబాటు ధరలలో వీసా రేట్లను తీసుచ్చారు. 

ట్రంప్ టారిఫ్ వార్ తో ప్రపంచ దేశాలను భయపెడుతున్న వేళ.. చైనా ఇండియాకు దగ్గరవ్వాలని చూస్తోంది. అందుకోసం ఆర్థిక, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయాలని భావిస్తోంది. రెండు దేశాలు ఆర్థిక, వాణిజ్య సంబంధాలు బలపడితే ఇద్దరికీ లాభం ఉంటుందని చైనా ఎంబసీ స్పోక్ పర్సన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసి లబ్ది పొందాలని యూఎస్ చూస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో కలిసికట్టుగా ఎదుర్కోవాలంటే రెండు దేశాలు చేతులు కలపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.