
Harvard University: అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో విదేశీ విద్యార్థులతో పాటు అక్కడి యూనివర్సిటీలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. కొన్ని యూనివర్సిటీలకు ట్రంప్ సర్కార్ గ్రాంటులను సైతం నిలిపివేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన తర్వాత మరిన్ని చర్యలు యూనివర్సిటీలను ఆర్థికంగా కుదేలు చేసేవిగా మారుతున్నాయి. దీంతో అనేక దశాబ్ధాల చరిత్ర కలిగిన యూనివర్సిటీ యాజమాన్యాలు అప్రమత్తం అవుతున్నాయి.
తాజాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విదేశీ విద్యార్థుల చేరికను అడ్డుకుంటామని హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చిన వార్నింగ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో అమెరికా స్కూళ్లకు కీలకంగా ఉన్న ఆర్థిక వనరులు ప్రమాదంలో పడేస్తోంది. అలాగే మరోపక్క విదేశీ విద్యార్థులు వేరే చోట్ల డిగ్రీ కోసం వెళ్లాలని ప్రయత్నాలు చేసేలా ప్రేరేపిస్తోంది. అమెరికాకు వ్యతిరేకంగా, హమాస్ అనుకూల ధోరణి కలిగిన నినాదాలు యూనివర్సిటీ వాతావరణాన్ని విషపూరితంగా మార్చుతోందని హోంలాండ్ సెక్యూరిటీ క్రిస్టి నోయిమ్ అన్నారు. ఏప్రిల్ 30 నాటికి విదేశీ విద్యార్థులు చట్టాలకు విరుద్ధంగా చేసిన పనులకు సంబంధించిన వివరాలు అందించాలని హార్వర్డ్‌కి చెప్పారామె.
హార్వర్డ్ ప్రస్తుతం లొంగిపోయిందని, అక్కడి నాయకత్వమే దీనికి కారణంగా నోయిన్ స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికాలోని పేరొందిన యూనివర్సిటీలతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతావరణం తర్వాత ప్రస్తుత చర్యలు వచ్చాయి. ట్రంప్ ఈ క్రమంలో యూనివర్సిటీకి నిధుల నిలిపివేత నుంచి పన్ను రహిత సదుపాయాన్ని నిలిపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో పాలస్తీనాకు అనుకూల నినాదాలు చేసిన కొందరు విదేశీ విద్యార్థులను అధికారులు డిపోర్ట్ చేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
ALSO READ | చైనాతో చర్చలు జరుపుతున్నాం..మంచి డీల్ చేసుకోబోతున్నాం:డొనాల్డ్ ట్రంప్
హార్వర్డ్ రియాక్షన్..
అయితే ఈ వ్యవహారంలో నోయిన్ చేసిన వ్యక్తలను హార్వర్డ్ తప్పుపట్టింది. ట్రంప్ సర్కార్ డిమాండ్లతో తాము ఏకీభవించటం లేదని, తాము చట్టాలను ఫాలో అవుతామని పేర్కొంది. ప్రభుత్వం చేస్తున్న డిమాండ్లు గీతదాటుతూ అకడమిక్ స్వేచ్ఛకు భంగం కలిగించేవిగా ఉన్నాయని హార్వర్డ్ బదులిచ్చింది. ప్రభుత్వ అధికారులు కూడా చట్టాలకు లోబడి ముందుకు సాగాలని పేర్కొంది. ఎవరిపైనైనా చర్యలు తీసుకోవాలనుకుంటే వాటికి పూర్తి సాక్ష్యాలు ఉండాలని, చట్టప్రకారమైన ప్రక్రియలను ఫాలో అవ్వాలని, చట్టంలో అందించిన హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలంది.
గత ఏడాది అమెరికాలోని యూనివర్సిటీలకు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులు వచ్చాు. ఇందులో హార్వడ్ విశ్వవిద్యాలయంలో 6800 మంది చేరారు. ఈ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ప్రపంచ దేశాల నుంచి తెలివైన, మంచి ఆలోచనలు కలిగిన విద్యార్థులను చేర్చుకుంటాయి. ఈ క్రమంలో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు రక్షణ కలిగిన ఇతర దేశాల్లో తమ పిల్లలను చేర్పించాలని చూస్తుంటారని ఎడ్యుకేషన్ అడ్వైజర్లు చెబుతున్నారు. వారు సైతం విద్యార్థులకు ఇదే ఆలోచనతో సలహాలు సూచనలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ క్రమంలో మే 1 నుంచి తర్వాతి విద్యా సంవత్సరానికి హాజరు గురించి విద్యార్థులు యూనివర్సిటీలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో అమెరికా యూనివర్సిటీలపై ట్రంప్ సర్కార్ కొరఢా జుళిపించటం చాలా మంది విదేశీ విద్యార్థులను అమెరికాలో చదువు గురించి ఆలోచనలో పడేస్తోంది. పైగా స్టూడెంట్ వీసాలపై ఉన్న వారు చేసే చిన్న తప్పులకు సైతం సెల్ఫ్ డిపోర్టేషన్ మెయిల్స్ రావటం, వారి సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టడం వంటి చర్యలు చాలా మంది విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోందని తెలుస్తోంది. 2023-24 విద్యా సంస్థరంలో అమెరికాలో కోటి 90 లక్షల మంది విదేశీ విద్యార్థులు ఉండగా వారిలో మెజారిటీ 23 శాతం భారతీయులు ఉన్నారు. వీరి సంఖ్య 3లక్షల 32వేలుగా ఉంది. ఇండియా తర్వాత ఎక్కువ మంది స్టూడెంట్స్ చైనా నుంచి ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి.