Investment: ఇన్వెస్టర్స్ అలర్ట్.. ఇక వీటిలో పెట్టుబడులే లాభదాయకం: క్వాంట్ ఏఎంసీ

Investment: ఇన్వెస్టర్స్ అలర్ట్.. ఇక వీటిలో పెట్టుబడులే లాభదాయకం: క్వాంట్ ఏఎంసీ

Investment Planning: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు అస్సలు మింగుడు పడటం లేదు. రెండవ టర్మ్ ట్రంప్ చాలా దూకుడుగా తమ పనితాను చేసుకుపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఈ క్రమంలో ఈక్విటీ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు ప్రధానంగా గందరగోళ పరిస్థితులను చూస్తున్నారు. ఈ క్రమంలో భారతీయ మార్కెట్లు ఎక్కువగా కరెక్షన్ చూశాయని క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వెల్లడించింది.

ప్రస్తుతం అమెరికా స్టాక్ మార్కెట్లు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నాయి. ట్రంప్ సుంకాల చర్యలు వాణిజ్యాన్ని దెబ్బతీయటంతో పాటు.. అమెరికా ఆధిపత్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని క్వాంట్ నివేదికలో పేర్కొంది. అమెరికా మార్కెట్ల పతనం యూరోపియన్, చైనా మార్కెట్లలోని ఈక్విటీ పెట్టుబడులకు ప్రోత్సాహకంగా నిలవవచ్చని పేర్కొంది. వాస్తవానికి ఏప్రిల్ నెలలో మార్కెట్లు సీజనల్ గా బులిష్ మెుమెంటం కలిగి ఉంటాయి, అయితే ఈ సారి మార్కెట్లు అద్వాన్నంగా ఉన్నాయని ఏఎంసీ పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్కెట్లు కన్సాలిడేషన్ ఫేజ్ చూస్తున్నాయి.

ట్రంప్ చర్యలు ఆయయను ప్రపంచ వ్యాప్తంగా విజేతగా నిలుపుతున్నప్పటికీ.. అంతర్గతంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడటానికి కారణంగా మారుతుందనే వాదనలు ఉన్నాయి. వాణిజ్య సుంకాల పోరు ముఖ్యంగా ద్రవ్యోల్బణం ప్రమాదాన్ని పెంచుతాయని క్వాంట్ ఫండ్ సందీప్ టాండన్ పేర్కొన్నారు. ఈ చర్యలు మార్కెట్లలో భారీ ఒడిదొడుకులకు దారితీస్తున్నాయని అన్నారు. దీనికి అనుగుణంగానే డాలర్ ఇండెక్స్ కూడా భారీ కరెక్షన్ కి గురవుతోందని పేర్కొన్నారు.

Also Read:- ఆర్‌బీఐ కొత్త డిప్యూటీ గవర్నర్ నియామకం.. ఎవరు ఈ పూనమ్ గుప్తా..?

ఈ తరుణంలో క్రిప్టో కరెన్సీలు, క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నాయని క్వాంట్ పేర్కొంది. అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు వీటివైపు మెుగ్గుచూపుతున్నట్లు పేర్కొంది. అలాగే క్వాంట్ అంచనాల ప్రకారం బంగారం కూడా మరింత ర్యాలీని చూడవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది రెండవ అర్థ భాగంలో గోల్డ్ రేట్లు కరెక్షన్ చూసే అవకాశం ఉందని కానీ దీనికి ముందు గరిష్ఠాలకు చేరవచ్చని పేర్కొన్నారు. దీర్ఘ, మధ్య కాలానికి బంగారంపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయని పేర్కొంది. 

భారత ఈక్విటీ మార్కెట్ల పరిస్థితి ఏంటి..
గత ఏడాది జూలై తర్వాతి నుంచి భారతీయ మార్కెట్లు కరెక్షన్ ఫేజ్ కొనసాగిస్తున్నట్లు క్వాంట్ వెల్లడించింది. ఇప్పటికే 69 శాతం కరెక్షన్ దశ పూర్తయిందని వెల్లడించింది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఇన్ ఫ్రా, హోటల్స్ అండ్ హాస్పిటాలిటీ, ఫార్మా, మెటీరియల్స్, రిటైల్, టెలికాం వంటి రంగాల్లో తమ రిస్క్ కి అనుగుణుంగా కొన్ని షేర్లను బెట్టింగ్ కోసం ఎంపిక చేసుకోవచ్చని పేర్కొంది. ప్రధానంగా పెట్టుబడిదారులు లార్జ్ క్యాప్స్, మెగా లార్జ్ క్యాప్ స్టాక్స్ దీర్ఘకాలిక వ్యూహంతో కొనుగోళ్లు చేయటం ఉత్తమంగా సూచిస్తోంది. ఈ లెక్కన భారతీయ ఇన్వెస్టర్లు గోల్డ్, లార్జ్ క్యాప్ షేర్లను రాబడి కోసం పరిగణించవచ్చని తెలుస్తోంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.