బీజేపీ తర్వాతి టార్గెట్‌‌ చర్చి భూములే: రాహుల్‌‌ గాంధీ

బీజేపీ తర్వాతి టార్గెట్‌‌ చర్చి భూములే: రాహుల్‌‌ గాంధీ

న్యూఢిల్లీ: దేశంలోకెల్లా అత్యధిక భూములు కలిగిన క్రైస్తవ సమాజమే బీజేపీ నెక్స్ట్‌‌ టార్గెట్‌‌ కావొచ్చని లోక్‌‌సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్‌‌ గాంధీ ఆరోపించారు. ఈమేరకు ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌కు చెందిన ఆర్గనైజర్‌‌‌‌ వెబ్‌‌సైట్‌‌ ఓ ఆర్టికల్‌‌ను పోస్ట్ చేసిందని శనివారం ‘ఎక్స్‌‌’లో పేర్కొన్నారు. ‘‘దేశంలో అత్యధికంగా భూములు కలిగిన ఉన్న సంస్థ కాథలిక్‌‌ క్రిస్టియన్‌‌ సంస్థలే. వీళ్ల అధీనంలో దాదాపు 7 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. 

వక్ఫ్‌‌ బిల్లు ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తుంది. భవిష్యత్‌‌లో ఇతర వర్గాలను లక్ష్యంగా చేసే అవకాశం ఉంది. ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌ వెబ్‌‌సైట్‌‌ ఆర్గనైజర్‌‌‌‌లో వచ్చిన ఆర్టికల్‌‌ ఇందుకు ఎగ్జామ్‌‌ఫుల్‌‌. ప్రజలపై ఇలాంటి దాడుల నుంచి రక్షించే ఏకైక కవచం రాజ్యాంగమే. దానిని కాపాడుకోవడం మన సమష్టి కర్తవ్యం” అని రాహుల్‌‌ గాంధీ ట్వీట్​ చేశారు.