హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో తండేల్

హార్ట్ టచింగ్ ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో తండేల్

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందూ మొండేటి రూపొందించిన చిత్రం ‘తండేల్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్  నిర్మించారు.  ఫిబ్రవరి 7న పాన్ ఇండియా వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు, తమిళ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేయగా,  శుక్రవారం ముంబైలో హిందీ వెర్షన్‌‌‌‌‌‌‌‌ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌‌‌‌‌‌‌కు ముఖ్య అతిథిగా హాజరైన అమీర్ ఖాన్ మాట్లాడుతూ ‘ఈ మూవీ ట్రైలర్ నాకు బాగా నచ్చింది.  హార్ట్ టచింగ్ ఎమోషన్స్ ఉన్నాయి.

నాగ చైతన్య ఫెంటాస్టిక్ యాక్టర్. సాయి పల్లవి కూడా చాలా మంచి పెర్ఫార్మర్.  ఈ సినిమా  పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు. నాగ చైతన్య మాట్లాడుతూ ‘ఈ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అమీర్ ఖాన్ గారు లాంచ్ చేయడం చాలా బలాన్ని ఇచ్చింది. ఈ కథ చెప్పినప్పుడే నాకు చాలా ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా అనిపించింది. ఇదొక బ్యూటిఫుల్ లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీ. శ్రీకాకుళం వెళ్లి అక్కడ మత్స్యకారుల్ని కలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన సంఘటనలు విన్నప్పుడు ఈ సినిమా నాకు ఎంత ఛాలెంజింగ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందో అర్థమైంది.

ఇలాంటి కథలు యాక్టర్స్‌‌‌‌‌‌‌‌కి చాలా అరుదుగా వస్తాయి’ అని అన్నాడు.  రాజు అనే క్యారెక్టర్ కరాచీలో తన మనుషుల కోసం ఏం చేశాడనేది చాలా ఆసక్తికరంగా ఉంటుందని దర్శకుడు చందూ మొండేటి అన్నాడు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఇది నిజంగా జరిగిన కథ. వైజాగ్ తీర ప్రాంతంలోని కొందరు వ్యక్తులు చేపల వేటకు గుజరాత్ వెళ్లి పొరపాటున బోర్డర్ క్రాస్ చేసి పాక్ సైన్యం చేతిలో చిక్కుకొని జైలు పాలైనవారి కథ. 

దర్శకుడు చందు ఈ కథని అద్భుతంగా తీర్చిదిద్దాడు.  జైలు సీన్స్, విలేజ్ సీన్స్, లవ్ స్టోరీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌ని బాగా ఆకట్టుకుంటాయి. సాయి పల్లవి చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు’ అని అన్నారు. ఇందులోని పాటలు అందర్నీ అలరిస్తాయని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు.