మిడ్ వెస్ట్ గ్రానైట్ లో బ్లాస్టింగ్.. ఒకరి మృతి

మిడ్ వెస్ట్ గ్రానైట్ లో బ్లాస్టింగ్.. ఒకరి మృతి

మహబూబాబాద్ జిల్లాలో బాంబు బ్లాస్టింగ్ కలకలం రేపింది. సెప్టెంబర్ 13 బుధవారం కేసముద్రం మండలం అర్పణపల్లి శివారులోని మిడ్ వెస్ట్ గ్రానైట్ లో బాంబు బ్లాస్టింగ్ జరిగింది. ఈ బ్లాస్టింగ్ లో అమీర్ పాషా అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుత్రికి తరలించారు. అమీర్ పాషా క్వారీలో జాకీ లేబర్ గా పనిచేస్తున్నాడు ఈ క్రమంలో క్వారీలో భారీ పేలుడు సంభవించింది.  

పేలుళ్ళు జరగడంతో బండలకు జాకీ పెడుతున్న అమీర్ పాషా దేహం ముక్కలు ముక్కలై చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు ఆందోళన చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు క్వారీ నుంచి కదిలేదే లేదని డిమాండ్ చేశారు. వరుస బ్లాస్టింగ్ లతో చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.