
- అమిత్ మాలవీయ విమర్శ
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్‌వి అవే ఎమర్జెన్సీ ఆలోచనలని బీజేపీ ఐటీ సెల్ నేషనల్ కన్వీనర్ అమిత్ మాలవీయ అన్నారు. ఎవరైనా అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయని గుర్తుచేశారు. కానీ ఎమర్జెన్సీ మనస్తత్వం కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోవడంతో వారిలో చట్టాలపై గౌరవం కనిపించడం లేదని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ప్రజలను నగ్నంగా ఊరేగించే హక్కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఏ చట్టం ఇచ్చిందని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సమాచారాన్ని విశ్లేషించడానికి ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టీకి ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. సున్నిత అంశమైన జనాభా డేటాను విదేశీయులకు ఇవ్వడం సరికాదన్నారు. కులగణన వివరాలను విశ్లేషించడానికి అర్హత కలిగిన భారతీయ నిపుణులు లేరా అని ఆయన ‘ఎక్స్’లో ప్రశ్నించారు.