ఇవాళ కాగజ్​నగర్​కు అమిత్ షా రాక

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్​నగర్​లో ఆదివారం బీజేపీ నిర్వహించనున్న వికాస సంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. స్థానిక ఎస్పీఎం గ్రౌండ్​లో నిర్వహించే సభకు హైదరాబాద్​లోని బేగంపేట విమానాశ్రయం నుంచి మద్యాహ్నం ఒంటి గంటకు హెలికాప్టర్​లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కాగజ్‌‌నగర్​కు చేరుకుంటారు. అక్కడి నంచి సభకు చేరుకొని ప్రసంగిస్తారు. అనంతరం నిజామాబాద్ సభకు వెళ్లనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఎస్పీ సురేశ్​ కుమార్​ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ పార్లమెంట్ ఇన్​చార్జి అల్జాపుర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే హరీశ్ బాబు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.