మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా భేటీ..

 మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో  కేంద్రహోంమంత్రి అమిత్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరుగుతోన్న ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, బిహార్, చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల సీఎంలు, సీఎస్ లు, డీజీపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ లు,ఏపీ నుంచి హోంమంత్రి అనిత పాల్గొన్నారు.. 

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో ఐదు కేంద్ర శాఖల మంత్రులతోపాటు డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు, కేంద్ర సాయుధ బలగాలకు చెందిన సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

2026నాటికి మావోయిస్టు సమస్యను రూపుమాపడమే లక్ష్యంగా  చర్చలు జరగనున్నాయి. త్వరలోనే  మావోయిస్టు సమస్య నుంచి దేశానికి విముక్తి కల్పిస్తామని ఇప్పటికే ప్రకటించారు కేంద్రహోంమంత్రి అమిత్ షా.

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో కూడా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రి కొండా సురేఖ కామెంట్స్, హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇస్తూ ఆర్డినెన్స్, మూసీ రివర్ డెవలప్మెంట్, ఇతర రాజకీయ అంశాలను హైకమాండ్ కు సీఎం వివరించనున్నారని సమాచారం.