మార్చి 8 నుంచి మణిపూర్ ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చు: అమిత్ షా

మార్చి 8 నుంచి మణిపూర్ ప్రజలు స్వేచ్ఛగా తిరగొచ్చు: అమిత్ షా

న్యూఢిల్లీ: మార్చి8 నుంచి మణిపూర్ ప్రజలు రోడ్లపై స్వేచ్ఛగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని భద్రతా బలగాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. మణిపూర్‌‌‌‌‌‌‌‌లో భద్రతా పరిస్థితులపై శనివారం ఢిల్లీలో అమిత్ షా సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌‌‌‌‌‌‌‌లో శాంతిని నెలకొల్పేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఇందుకోసం అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. 

‘‘ఇంటర్నేషనల్ బార్డర్ గుండా మణిపూర్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అయ్యే ప్రాంతాల్లో ఫెన్సింగ్ వర్క్ వీలైనంత తొందరగా పూర్తిచేయాలి. మణిపూర్‌‌‌‌‌‌‌‌ను డ్రగ్ ఫ్రీ స్టేట్‌‌‌‌గా మార్చాలి” అని ఆదేశించారు. 

కాగా, మణిపూర్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలను వారం రోజుల్లోగా అప్పగించాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీనికి ఫిబ్రవరి 20 డెడ్‌‌‌‌లైన్ విధించారు. ఈ క్రమంలో 300కు పైగా ఆయుధాలను ప్రజలు అప్పగించారు.