నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రానున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేష్ కులాచారితో కలిసి ఆయన పార్టీ జిల్లా ఆఫీస్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రధానిగా మరోసారి మోదీ కావాల్సిన చారిత్రక అవసరం ఉందన్నారు. అర్వింద్‌ను ఎంపీగా గెలిపించేందుకు ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. అమిత్ షా అటెండ్ కానున్న సభ ఏర్పాట్లను అర్వింద్ పార్టీ లీడర్లతో కలిసి పరిశీలించారు. 34 డివిజన్ కార్పొరేటర్ శనివారం బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరారు. మాజీ కార్పొరేటర్చంద్రభూషణ్, కైరం కొండ మురళి, గుండా సతీశ్, నల్ల గంగాధర్‌కు కాషాయ కండువా వేసి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.