సక్సెస్ ఒంటరిగా రాదు. సరైన వ్యక్తు లు కలిస్తే అనుకున్నది సాధ్యమై సక్సెస్ రేటు పెరుగుతుంది. నరేంద్ర మోడీ, అమిత్ షాల జోడికి అదేబలం. మోడీ కనుసన్నల్లో , అతని మనసెరిగి పనిచేయడం అమిత్ కి బాగా తెలిసిన విద్య. అలాగే, టార్గెట్ ఫిక్స్ చేసి అమిత్ కి అప్పగించేసి, మధ్యలో కలగజేసుకోకపోవడం మోడీకి అతనిపై గల నమ్మకం. ఆరెస్సెస్ కి ఒకరు ప్రచారక్‌గా, మరొకరు స్వయం సేవక్‌గా పనిచేసినప్పటి నుంచి ఏర్పడిన ఈ అనుబంధం దాదాపు 40 ఏళ్లుగా కొనసాగుతోంది. 2014లో నరేం ద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరిం చాకసాధించిన అన్ని రాజకీయ విజయాల్లో నూ అమిత్ షాకి భాగస్వామ్యం ఉంది. ఈ ఏడాదిలో జరగాల్సిన ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఈ పార్టనర్ షిప్ లోనే బీజేపీ సిద్ధమవుతోంది.
ప్రతి మూడేళ్ల కొకసారి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం, వరుసగా రెండు టర్మ్‌లకు మించి ఎవరినీ ప్రెసిడెంట్ కుర్చీలో కంటిన్యూ చేయకపోవడం, జోడు పదవులకు వీలు కల్పించకపోవడం భారతీయ జనతా పార్టీ విధానం. గతంలో అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్‌లనుసైతం ఇదే తీరుగా మార్చిన సందర్భాలున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇప్పటికే రెండు టర్మ్‌లు పూర్తి చేసుకున్నారు. మోడీ కేబినెట్‌లో హోం మంత్రిగా చేరారు. కాబట్టి, బీజేపీ పాలసీ ప్రకారం అమిత్ తక్షణం తప్పుకోవలసి ఉంటుంది. రాజ్‌నాథ్ హోం మంత్రి కాగానే, ఆయన రాజీనామా చేయడంతో, అమిత్ షా ఫస్ట్ టైమ్ బీజేపీ ప్రెసిడెంట్‌గా వచ్చారు. 2016లో సెకండ్ టర్మ్‌కి ఎన్నికయ్యారు. కాల పరిమితి ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉన్నా గానీ.. పార్టీ పాలసీ ప్రకారం తక్షణం తప్పుకోవలసి ఉంటుంది.
కాకపోతే, నరేంద్ర మోడీ, అమిత్ షాల జోడీ వరుస విజయాలతో బీజేపీని మునుపెన్నడూ లేని టాప్ పొజిషన్‌కి తీసుకెళ్లారు. త్వరలోనే జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగాలి. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాజకీయ సంక్షోభాలు ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. మరోపక్క బీజేపీ మెంబర్‌షిప్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈసారి చేసే డ్రైవ్ పూర్తిగా పొలిటికల్ ఈక్వేషన్లను మార్చే విధంగా జరగబోతోంది. పార్టీలోకి కొత్త నీరును ఆహ్వానిస్తున్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎటుచూసినా కాషాయమే కనిపించాలని పార్టీ నిర్ణయించుకుంది. ఈశాన్యంలో ముందుగా బీజేపీ జెండా ఎగరేశాక, ఇప్పుడు సౌత్‌పై దృష్టి మళ్లించారు.
కాంగ్రెస్ పార్టీ లేదా ఇతర ప్రాంతీయ పార్టీల్లోకి నాయకుల స్థాయివాళ్లు రావడం పోవడం సర్వసాధారణం. ఐడియాలజీతో నడిచే సీపీఐ, సీపీఎం, బీజేపీ వంటి పార్టీల్లో సభ్యులను చేర్చుకుంటారే తప్ప, లీడర్లుగా ఎదిగినవాళ్లకు ఛాన్సివ్వరు. ఎవరూ రారు కూడా. 2014లో బీజెపీ కేంద్రంలో అధికారానికొచ్చాక సీన్ మారింది. ఎప్పుడూ సంఘ్ కార్యకలాపాలతో సంబంధం లేనివాళ్లను, వాళ్ల సోషల్ యాక్టివిటీస్‌లో పాల్గొననివాళ్లనుకూడా ఆహ్వానించడం మొదలెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో చూస్తే… దగ్గుబాటి పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ తదితర పైస్థాయి లీడర్లను చేర్చుకున్నారు. పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దింపారు. మహిళా విభాగం, రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలుసైతం కట్టబెట్టారు. ఇదే తరహాలో దేశవ్యాప్తంగా తాము బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో వలసల్ని ప్రోత్సహించే పనిలో పడ్డారు. ఇప్పటికే తెలంగాణలో డీకే అరుణను చేర్చుకుని ఎంపీ సీటిచ్చి పోటీ చేయించారు. కర్ణాటకలో సుమలతపై క్యాండిడేట్‌ని నిలబెట్టకుండా ఆమె గెలుపుకు సహకరించారు. ఈ బాధ్యతలు చురుగ్గా సాగాలంటే… అమిత్ షాని కొనసాగించాల్సిందేనన్న ఫీలింగ్ తమలో బలంగా ఉందంటున్నాయి పార్టీ వర్గాలు.
నరేంద్ర మోడీ, అమిత్ షాలు ఒక పద్ధతిగా పార్టీలోని ప్రత్యర్థులనుకూడా సైడ్ ట్రాక్‌లోకి నెట్టేస్తారని పొలిటికల్ ఎనలిస్టులు చెబుతుంటారు. ఇందుకు ఉదాహరణగా కేశుభాయ్ పటేల్‌నే చూపిస్తారు. కేశుభాయ్ పాలన (1998–2001) చివరి దశకొచ్చేసరికి అధికార దుర్వినియోగం, పక్షపాతం వంటి ఆరోపణలు పెరిగాయి. 2001లో భుజ్ భూకంపంతో గుజరాత్ చాలా దెబ్బతిన్నది. సహాయక చర్యల విషయంలో కేశుభాయ్ ప్రభుత్వం ఫెయిలైందని మీడియా గగ్గోలు పెట్టింది. ఆ సమయంలో గుజరాత్ సీఎంగా కొత్త ముఖాన్ని తీసుకురావాలని పార్టీ నిర్ణయించుకున్నప్పుడు ఏకైక ఛాయిస్‌గా మోడీ కనిపించారు. కేశుభాయ్ ఆ తర్వాత గుజరాత్ పరివర్తన పార్టీ’ని పెట్టి, మోడీ–షా టీమ్‌ని దుమ్మెత్తిపోసేవారు. అయినప్పటికీ వీళ్లు పట్టించుకోలేదు సరికదా, కేశుభాయ్‌ని పెద్దన్నగానే సంబోధించేవారు. చివరికి కేశుభాయ్ రాజకీయ జీవితం ముగిసిపోయింది. అదే తరహాలో శంకర్‌సింఘ్ వఘేలా కూడా. అయిదుసార్లు లోక్‌సభకి, ఒకసారి రాజ్యసభకి ఎన్నికైన సీనియర్ నాయకుడు వఘేలా. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి ఫిరాయించి, చివరకు ఎమ్మెల్యేగా ఓడిపోయి రాజకీయ జీవితపు చరమాంకంలో పడ్డారు. ఇటీవలి ఎన్నికల్లో ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితర సీనియర్‌మోస్ట్ నాయకులను మోడీ–షాలు ట్రీట్ చేసిన తీరు అందరికీ తెలిసిందే.
ఇప్పుడు అమిత్ షాపై చాలా బాధ్యతలు వచ్చి పడ్డాయి. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో తమ జెండా పాతేయడానికి దూకుడుగా వెళ్తున్నారు. సౌత్‌లో పార్టీపరంగా పాజిటివ్ సింప్టమ్స్ ఉన్నప్పటికీ పొలిటికల్ అజెండా ఇంకా ఫిక్స్ కాలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచారు. జనరల్ ఎలక్షన్స్‌లో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో కేడర్‌లోనూ మంచి ఊపు వచ్చింది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో తమ పాత మిత్రుడు చంద్రబాబునాయుడు పార్టీ నుంచి వలసలను బాగా ప్రోత్సహించే పనిలో పడ్డారు. దీనికి రెండు కారణాలున్నాయి. చంద్రబాబు ఒకసారి అధికారంలో ఉంటే, పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటారన్న సెంటిమెంట్ ఒక కారణమైతే, ఆయన వయసు (69) రీత్యా 2024 నాటికి పార్టీని నడిపించలేరన్నది రెండో కారణం. తెలుగు దేశం పార్టీకి భవిష్యత్తు లేదన్న ఫీలింగ్ బాగా వ్యాపించింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి తమకు అనుకూలంగానే ఉన్నా… ఎన్నికల పోరులో అపోజిషన్‌గా నిలబడే ఛాన్స్‌ని కాంగ్రెస్ పార్టీ కొట్టేయకుండా చూసుకోవాలని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే అమిత్ షా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీని బలోపేతం చేయడానికి వలసలను ఎంకరేజ్ చేస్తున్నారు. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నాయకులతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం.
పొలిటికల్ వార్ పక్కనబెడితే… జమ్మూ కాశ్మీర్‌ని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడమనేది మరో పెద్ద బాధ్యత. ఆ రాష్ట్రానికి ఆర్టికల్–370 ద్వారా అపరిమితమైన అధికారాలు, హక్కులు దక్కాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల డీలిమిటేషన్ జరిగినా జమ్మూకాశ్మీర్‌లో మాత్రం జరగడం లేదు. దీనివల్ల ఆ రాష్ట్రంలో రాజకీయాధికారం కాశ్మీర్ లోయకే పరిమితమవుతోంది. జమ్మూలోనూ, లఢాఖ్‌లోనూ పెద్ద సంఖ్యలో ఉండే హిందువులకు పొలిటికల్ ప్రాతినిధ్యం సమంగా దక్కడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో ఆర్టికల్–370ని రద్దు చేసే బాధ్యతనుకూడా హోం మంత్రి హోదాలో అమిత్ షాయే మోయాల్సి వస్తుంది. జమ్మూ కాశ్మీర్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో దీనినే ప్రచార అస్త్రంగా వాడుకోవలసి ఉంది. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ వంటి నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోరును; మధ్యప్రదేశ్, కర్ణాటక రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ సంక్షోభాలను ఎదుర్కొనాలి. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో లెఫ్ట్ కేడర్‌ని పూర్తిగా కాషాయీకరణ చేసే పనిని పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒడిశాల్లో పార్టీలో కొత్త నీరును ప్రవేశపెట్టాలి. ఇన్ని బాధ్యతలున్నందువల్లనే అమిత్ షాని బీజేపీ పాలసీ ప్రకారం రాజీనామా చేయించకుండా కంటిన్యూ చేయిస్తున్నారని పొలిటికల్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
మోడీకి నమ్మకస్తుడు
అమిత్ షాకి ఈ పలుకుబడిగానీ, పార్టీలో రైజింగ్‌గానీ అకస్మాత్తుగా వచ్చింది కాదు. కాలేజీ రోజుల నుంచీ ఆయన సంఘ్ యాక్టివిటీస్‌లో చురుకుగా పాల్గొన్నారు. నరేంద్ర మోడీ అప్పట్లో ప్రచారక్‌గా ఉండేవారు. అమిత్ షా ఆరెస్సెస్ స్వయం సేవక్‌గా పనిచేశారు. వీరిద్దరూ 1982 నుంచి అహ్మదాబాద్‌లో ఆరెస్సెస్ నిర్వహించే యూత్ సర్వీసెస్‌లో కలిసి పాల్గొనేవారు. ఈ గురుశిష్యానుబంధం అప్పటి నుంచీ కొనసాగుతోంది. మోడీ రాజకీయ గురువులు కేశుభాయ్ పటేల్, శంకర్ సింగ్ వఘేలాల స్థానాన్ని ఆక్రమించారు. 2001లో కేశుభాయ్‌ని తప్పించి, మోడీని ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత అమిత్ ప్రాబల్యం బాగా పెరిగింది. అమిత్ షాపై మోడీకున్న నమ్మకం ఎంత బలమైనదంటే… 2002 ఎన్నికల్లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచాక కీలక శాఖలు కట్టబెట్టారు. హోం, ట్రాన్స్‌పోర్ట్ తదితర 12 శాఖలకు అమిత్ షా ఒక్కరే మంత్రి!
మాటకారి…
బీజేపీ పగ్గాలు అందుకున్న తర్వాత కేడర్‌నిక్షణం తీరికలేకుం డా పరుగులు పెట్టించా రుఅమిత్ షా. ఇతర పార్టీల అధినాయకుల్లాఏసీ రూమ్ లో వార్ స్ట్రేటజీని రూపొందిం చేబాపతు కాదు. ఈ అయిదేళ్లలోనూ మహా-రాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ ,అస్సాం , ఉత్తరప్రదేశ్ , ఉత్తరాఖండ్ , గుజరాత్ ,హిమాచల్ ప్రదేశ్ , గోవా తదితర రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తెచ్చారు. త్రిపురలోసీపీఎం కోటను బద్దలు కొట్టారు. ఈశాన్యరాష్ట్రాల్లో కొన్ని చోట్ల నేరుగానూ, కొన్ని చోట్లమిత్ర పక్షంగానూ పవర్ దక్కించుకున్నా రు.మొన్నటి జనరల్ ఎలక్షన్స్‌లో మొత్తం 542లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరగ్గా, అమిత్ షా312 స్థా నాల్లో స్వయంగా పర్యటించా రు.161 బహిరంగ సభల్లో ప్రసంగించా రు. 18స్ఠా నాల్లో రోడ్ షోలు నిర్వహించా రు. తన అయి-దేళ్ల కాలంలో దాదాపు 1,500 పార్టీ మీటిం గ్ ల్లోపాల్గొ ని కేడర్‌కి దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వాలను 11 కోట్లకు పెంచగలిగారు. అమిత్‌షా చాకచక్యానికి, చాణక్యానికి చెరగని సాక్ష్యా-లుగా… గోవాలో అధికారాన్ని దక్కించుకోవడం,ఉత్తరప్రదేశ్ లో అఖండ విజయం సాధిం చడం,బెం గాల్ లో బలమైన ప్రతిపక్షంగా ఎదగడం,మహారాష్టలో శివసేనతో స్నేహాన్ని కంటిన్యూచేయడం, బీహార్‌లో అధికార జేడీ(యూ)ని మళ్లీఎన్డీయేలోకి చేర్చడం వంటివి చెప్పుకోవాలి.అలాగని, అమిత్ ఖాతాలో అన్నీ విజయాలేఉన్నాయని చెప్పడం దుస్సాహసమే. బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజస్థాన్ , మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు కాంగ్రెస్ మళ్లీ దక్కించుకుంది. ఢిల్లీలో ఆప్ చేతిలో ఘోరంగా ఓడిపోయిం ది.బీహార్‌లో చిరకాల మిత్రుడు నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి తప్పుకుని ఆర్‌జేడీతో కలిసి మళ్లీ అధికారానికొచ్చారు.