అమిత్‌ షాతో రాష్ట్ర నేతల భేటీ

అమిత్‌ షాతో రాష్ట్ర నేతల భేటీ

వెలుగు: లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదలవడంతో బీజేపీ ‘గెలుపు’ కసరత్తు మొదలెట్టింది. జాతీయ నేతల పిలుపు మేరకు సోమవారం ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలు పార్టీ చీఫ్‌‌‌‌‌‌‌‌ అమిత్‌ షాతో భేటీ అయ్యారు . రాష్ట్రంలో పార్టీ విజయావకాశాలు, అభ్యర్థుల ఎంపికపై షాతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ , ఎంపీ బండారు దత్తాత్రేయ, కిషన్‌‌‌‌‌‌‌‌రెడ్డి చర్చించినట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే అభ్యర్థుల జాబితాతో ఈ నెల 15న ఢిల్లీ రావాలని నేతలను షా ఆదేశించినట్టు సమాచారం. ఆ రోజే అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలిసింది. పార్టీ రాష్ట్ర కోర్‌ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై లోక్‌‌‌‌‌‌‌‌సభ స్థానాల వారీగా సమీక్షలు చేసింది. నియోజకవర్గానికి ముగ్గురు చొప్పున అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేసింది.