అధికారంలోకి రాగానే కేసీఆర్ జైలుకే : అమిత్ షా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి.. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ స్టీరింగ్ మజ్లీస్ చేతిలో ఉందని చెప్పారు.నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహిచారు. ఈ సభలో అమిత్ షా మాట్లాడారు. 

పదేళ్లలో తెలంగాణను విధ్వంసం చేశారని చెప్పారు అమిత్ షా. ఆర్టీసీ స్థలాలను కూడా బీఆర్ఎస్ నేతలు వదలడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ పై కేంద్రం పన్ను తగ్గిస్తే.. కేసీఆర్ సర్కారు మాత్రం పట్టించుకోలేదన్నారు. బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామన్న ఏకైక పార్టీ బీజేపీనే అని చెప్పారు. కేసీఆర్ సర్కార్ హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. ముస్లీం మైనార్టీలకు ఇచ్చే 4 శాతం రిజర్వేషన్లు బడుగు, బలహీన వర్గాలకు ఇస్తామని మాట ఇచ్చారు.