సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: అమిత్ షా

సీఏఏను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. నేషనల్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీఏఏ విషయంలో   కేంద్ర ప్రభుత్వం రాజీపడబోదన్నారు. దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించడం సార్వభౌమ హక్కు అని  చెప్పారు.  ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశమే లేనప్పుడు సీఏఏను ఎలా రద్దు చేస్తారని సెటైర్ వేశారు. 

ALSO READ :- IPL 2024: కేకేఆర్‌కు ఊహించని ఎదురు దెబ్బ.. గాయంతో కెప్టెన్ ఔట్

రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీతో, ఒవైసీ సహా అన్ని ప్రతిపక్ష పార్టీలు అబద్ధాల రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు అమిత్ షా. సీఏఏ అమలు చేస్తామని 2019 నుంచి చెబుతున్నామన్నారు. సీఏఏ అనేది ఎవరి పౌరసత్వాన్ని తీసివేయడానికి కాదన్నారు.  అఖండ భారతదేశంలో భాగమైన వారందరికీ పౌరసత్వం ఇస్తామని చెప్పారు.