దళితులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దళితులకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. బీజేపీ నేతలు అంబేద్కర్ పట్ల వారికున్న అక్కసును వెల్లగక్కారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేశారు. 

అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. ఒక హోంమంత్రి హోదాలో ఉండి చేయాల్సిన వ్యాఖ్యలు కాదు. గత కొద్ది నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటలను జరుగుతుంటే.. ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 

కాకా వెంకటస్వామి వర్థంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఆయన విగ్రహానికి పూల వేసి నివాళులర్పించారు ఎంపీ వంశీకృష్ణ. అంబేద్కర్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలు పెట్టి ఎంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామన్నారు.